టాలీవుడ్

సంక్రాంతి బరిలోకి దిగుతున్నాడు

raj tarunrangula-ratnamఈ సంక్రాంతికి మరో హీరో రంగంలోకి దిగుతున్నాడు. స్టార్ హీరోలతో పోటీ పడుతున్నాడు. ఆ హీరో మరెవరో కాదు…రాజ్ తరుణ్ ఇప్పటి వరకు ప్రధానంగా మూడు సినిమాలే సంక్రాంతికి పోటీ పడుతుండగా.. ఇప్పుడు ఓ చిన్న సినిమాతో రాజ్ తరుణ్ వచ్చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.

రాజ్ తరుణ్ హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మించిన ‘రంగుల రాట్నం’ చిత్రం జనవరి 14న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చిత్ర శుక్లా ఈ సినిమాలో రాజ్ తరుణ్ కు జోడిగా నటించింది. లేడి డైరెక్టర్ శ్రీరంజని దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫ్యామిలీ లవ్ స్టోరిగా తెరకెక్కింది. ఈరోజు సాయంత్రం చిత్ర యూనిట్ ట్రైలర్ ను విడుదల చెయ్యబోతున్నారు.

‘ఉయ్యాలా జంపాలా’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని నిర్మించిన అన్నపూర్ణ స్టూడియోస్‌ మళ్ళీ రాజ్‌ తరుణ్‌తో చేస్తోన్న రెండో సినిమా ఇదే అవ్వడం విశేషం. ఈ సినిమాకు సంభందించి ఇంతవరుకు ఎలాంటి పబ్లిసిటి చెయ్యలేదు. విడుదలకు 10 రోజులు ఉండడంతో ఈరోజు నుండి ప్రమోషన్స్ స్టార్ట్ చెయ్యబోతున్నారు చిత్ర యూనిట్.

Comments

comments

Teaser

Latest

Song

Coming Soon

నా పేరు సూర్య MAY 4
కాలా

Now Showing

భరత్ అనే నేను APR 20
కృష్ణార్జున యుద్ధం APR 12
ఛల్ మోహన్ రంగ APR 5
రంగస్థలం MAR 30
నీదీ నాదీ ఒకే కథ MAR 23
MLA MAR 23
కిరాక్ పార్టీ MAR 16