టాలీవుడ్

‘బాహుబలి’కి వచ్చినప్పుడే అవార్డ్ లపై నమ్మకం పోయింది

r-narauana-murty‘బాహుబలి గొప్ప సినిమానే. సాంకేతికంగా, వాణిజ్యపరంగాతెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. అందుకు ఆ సినిమా దర్శకుడు రాజమౌళికి సెల్యూట్. కానీ బాహుబలి చరిత్ర కాదు, సందేశాత్మక సినిమా కాదు. అదొక కమర్షియల్ సినిమా మాత్రమే. దానికి జాతీయ అవార్డు వచ్చినప్పుడే అవార్డుల మీద నమ్మకం పోయింది. ఇప్పుడు మళ్లీ నంది కూడా ఇచ్చారు. ’ అని నారాయణ మూర్తి దర్శకుడు, నటుడు అన్నారు.

గతంలో సంస్కృతి, విలువలకు పట్టం కట్టేలా అవార్డులు ఇచ్చే వారని, కానీ ఇప్పుడు అవి ఓటు బ్యాంకు రాజకీయాల్లా మారాయని విమర్శించారు. ‘బాహుబలి’కి జాతీయ ఉత్తమ అవార్డు ఇచ్చినప్పుడే అవార్డులపై నమ్మకం పోయిందన్నారు. ఇప్పుడు పూర్తిగా వాణిజ్య చిత్రాలకే పురస్కారాలు ఇవ్వడం ఆనవాయితీగా మారిందని నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు.

మూడు సంవత్సరాల తర్వాత ఎట్టకేలకూ ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల జాబితా అంతటా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. నిర్మాతలు, నటులు.. సినీ పరిశ్రమకు సంబంధం ఉన్న వ్యక్తులు.. బాహాటంగా అసహనాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకించి ‘కులం’ అనే అంశంలో వారు తమ అభిప్రాయాలను సూటిగా వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపధ్యంలో నంది అవార్డులపై రేగిన వివాదం గురించి స్పందించారు సీనియర్ నటుడు, దర్శకనిర్మాత ఆర్.నారాయణమూర్తి. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఈ అవార్డుల తీరుపై నారాయణమూర్తి అసహనగళమే వినిపించారు. అవార్డులకు అర్హుల ఎంపిక ప్రాతిపదికను ఆయన తప్పు పట్టారు. ప్రత్యేకించి బాహుబలి సినిమాకు నంది దక్కడాన్ని నారాయణమూర్తి ఆక్షేపించారు

రుద్రమదేవి చిత్రానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నంది అవార్డు ప్రకటించకపోవడం బాధాకరమని ఆర్‌.నారాయణమూర్తి అన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం ఝాన్సీ లక్ష్మీబాయి ఎలా పోరాడారో అలాగే తెలుగుజాతి అభ్యున్నతికి రుద్రమదేవి పోరాడినట్లు భావిస్తామన్నారు. అలాంటి మహనీయురాలి జీవితాన్ని తెరకెక్కించినప్పుడు ప్రభుత్వం గుర్తించాలన్నారు.

Comments

comments

Teaser

Trailer

song

Coming Soon

లండన్ బాబులు 17

Now Showing

ఒక్కడు మిగిలాడు NOV 10
C/O సూర్య NOV 10
నెక్స్ట్ నువ్వే NOV 03
PSV గరుడ వేగ NOV 03

Poll