టాలీవుడ్

పూరి షార్ట్ ఫిలిం వచ్చేసింది, చూసారా

న్యూడ్ గా చెట్టును హగ్ చేసుకుంటే ఫీలింగ్ చాలా గొప్పగా ఉంటుంది. కానీ ఒక పాత చెట్టును హగ్ చేసుకునే ముందు కొత్త మొక్కను నాటండి…. అంటూ పూరి తన షార్ట్ ఫిల్మ్ ద్వారా చెప్పే ప్రయ్నం చేశారు.

ప్రకటించినట్టుగానే దర్శకుడు పూరీ జగన్నాథ్..తన ” హగ్ ” షార్ట్ ఫిల్మ్ ను ఆదివారం విడుదల చేశాడు. ఈ లఘు చిత్రం ద్వారా చెట్ల వల్ల మనకు కలిగే ప్రయోజనాలను వివరించాడు. మూడున్నర నిముషాల పాటు సాగిన ఈ సందేశాత్మక ఫిల్మ్ పూర్తిగా వాయిస్ ఓవర్ బ్యాక్ డ్రాప్ లో నడిచింది.

మీరు శ్వాస తీసుకుంటున్నారా? స్వచ్ఛమైన గాలి పీలుస్తున్నారా? అయితే మీరు ముందు థాంక్స్ చెప్పాల్సింది చెట్లకే. చెట్లు కూడా మీలాగే అనేక అనుభూతులను పొందుతాయి. మాట్లాడుకుంటాయి, ప్రజలను గుర్తు పడతాయి అంటూ పూరి చెప్పుకొచ్చారు.

చెట్ల ప్రాధాన్య‌త‌ని తెలుపుతూ రూపొందిన ఈ షార్ట్ ఫిల్మ్‌లోనూ త‌న శైలిలో ఆలోచింప‌జేసే మాట‌లు ఉన్నాయి. అయితే.. అవి ఆంగ్ల‌భాష‌లోనే ఉండ‌డం గ‌మ‌నార్హం. ఒక‌ట్రెండు అభ్యంత‌క‌ర షాట్స్ ఉన్నా.. ఓవ‌రాల్‌గా ఆక‌ట్టునేలా ఉంది ఈ షార్ట్ ఫిల్మ్‌.

తొలుత విడుదల చేసిన పోస్టర్ లోని న్యూడ్ స్టిల్ తో పూరీ దీన్ని ముగించాడు. పూరీ టేకింగ్, సందీప్ చౌతా నేపథ్య సంగీతం దీన్ని ఆసక్తికరంగా మార్చింది. ఈ షార్ట్ ఫిల్మ్ పై సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ ఇదివరకే ప్రశంసలు కురిపించాడు. పూరీ క‌నెక్ట్స్ నిర్మించిన ఈ షార్ట్ ఫిల్మ్‌కి సందీప్ చౌతా సంగీతాన్ని అందించ‌గా.. అనిల్ ప‌డూరి విజువ‌ల్ ఎఫెక్ట్స్ స‌మ‌కూర్చారు. జునైద్ సిద్దిఖీ ఎడిటింగ్ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఇసాబెల్లా న‌టించిన ఈ షార్ట్ ఫిల్మ్‌కి క‌త్రినా క్రివెన్కో వాయిస్ ఓవ‌ర్ ఇచ్చారు.

Comments

comments

Trending

Latest

Song

Coming Soon

అజ్ఞాతవాసి JAN 10
జై సింహ JAN 12
చలో FAB 2
తొలిప్రేమ FAB 9

Now Showing

ఒక్క క్షణం DEC 28
MCA DEC 21
హలో DEC 22
మళ్ళీ రావా DEC 8
జవాన్ DEC 1

Poll