గాసిప్స్

డ్రగ్స్ కేసు : పూరిని సిట్ అడిగిన మొదటి ప్రశ్న పవన్ గురించే

puri-pawanప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్. తన 17 యేళ్ల సినీ కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రాలను నిర్మించారు. అలాంటివాటిలో పవన్ కళ్యాణ్ – తమన్నా కాంబినేషన్ లో రూపొందిన “కెమెరామెన్ గంగతో రాంబాబు” ఒకటి. ఈ చిత్రం పూర్తిగా తెలంగాణ ఉద్యమం, తెరాస చీఫ్ కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్‌లను లక్ష్యంగా చేసుకుని తీశారనే ప్రచారం అప్పట్లో జరిగింది. అంతేకాకుండా, ఈ చిత్రంలో మీడియాని సైతం బాగా వెటకారం చేసారు పూరీ జగన్నాథ్.

అలాగే చిత్రంలో .. తెలంగాణ ఉద్యమ సమయంలో కేటీఆర్ ఏ విధంగా ప్రవర్తించారన్న అంశాన్ని ఇతివృత్తంగా చేసుకుని ఓ పాత్రను కల్పించి, ఆ పాత్రను ప్రకాష్ రాజ్‌తో వేయించారన్న విమర్శలు అప్పట్లో వచ్చాయి. ఈ చిత్రం విడుదలయ్యాక తెరాస కార్యకర్తలు ఈ చిత్ర ప్రదర్శనను కూడా అడ్డుకున్నారు. ఆ సమయంలోనే పూరీ జగన్నాథ్‌కు బెదిరింపులు కూడా వచ్చాయి. అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంతో ఈ సమస్య అంతటితో సమసిపోయిందని ప్రతి ఒక్కరూ భావించారు.

కానీ తాజాగా ఈ విషయం మరోసారి చర్చకు వస్తోంది. ఆ రోజు ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రం ద్వారా తమను కించపరిచేలా చేసినందుకే తెరాస నేతలు పూరీపై కక్ష కట్టారనే ప్రచారం ఫిల్మ్ నగర్‌లోనూ, మీడియాలోనూ జోరుగా సాగింది. అందువల్లే ఈ డ్రగ్స్ కేసులో పూరీ బ్యాచ్‌ను ఇరికించారనే వాదనలు వినిపించాయి. అయితే ఇప్పుడు ఈ వాదనను బలపరచేలా మరి కొన్ని విషయాలు బయిటకు వచ్చింది.

డ్రగ్స్‌ కేసు విషయమై చార్మి వేసిన కేసులోనూ ఇతర సినిమా వారికి సలహాలివ్వడంలోనూ ముఖ్య పాత్ర వహించిన బిజెపి నాయకుడు న్యాయవాది రఘునందన్‌ రావు ఆసక్తికరమైన మరో విషయం చెబుతున్నారు. దర్శకుడు పూరీజగన్నాథ్‌ను సిట్‌ అధికారులు అడిగిన మొదటి ప్రశ్న పవన్‌ కళ్యాణ్‌ నటించిన కెమెరా మెన్‌గంగతో రాంబాబు సినిమాపైనే అంటున్నారు. ఆ సినిమా ఎందుకు తీశారు? ఎవరు వెనకున్నారు? పవన్‌ కళ్యాణ్‌ణే ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారని చెప్తున్నారు.

గతంలో పవర్‌స్టార్‌కూ తెలంగాణ పాలక కుటుంబానికి మధ్యలో నడిచిన వివాదాల నేపథ్యంలో పూరీపై ఒత్తిడి పెంచేందుకే ఈ ప్రశ్నలు వేశారు తప్ప ఆ చిత్రానికి డ్రగ్స్‌ కేసుకు సంబంధం ఏమిటని రఘు నందన్‌ రావు నాతో ఒక ఇంటర్వ్యూలో ప్రశ్న వేశారు.

Comments

comments

Latest

Recent

Songs

Coming Soon

జై లవ కుశ SEP 21
స్పైడర్ SEP 27
లండన్ బాబులు

Now Showing

యుద్ధం శరణం SEP 8
మేడమీదా అబ్బాయి SEP 8
పైసా వసూల్ SEP 1
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18
నేనే రాజు నేనే మంత్రి AUG 11
జయ జానకి నాయక AUG 11

Poll