టాలీవుడ్

‘స్పైడర్‌’లో ఆ సీన్స్ తొలగించాలి ,లేకుంటే ఆందోళ చేస్తాం

Spyder poster 4దసరా సందర్బంగా ఇటీవల విడుదలైన స్పైడర్‌ చిత్రం మిక్సెడ్ టాక్ తో తెలుగులో ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు మరో కొత్త సమస్య వచ్చి పడింది. ఈ సినిమాలో శ్మశానంలో పని చేసే కాటికాపర్లను కించపరుస్తూ ఉన్న సన్నివేశాలను తొలగించాలని రాష్ట్ర కాపర్ల సంఘం అధ్యక్షులు శీలం సత్యనారాయణ డిమాండ్‌ చేశారు.

ఆదివారం రామంతాపూర్‌లోని హిందూశ్మశాన వాటికలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎంతో మంది దళితులు ఎండక, వానకు శ్మశానంలోకష్టపడుతూ కాటికాపర్లుగా విధులు నిర్వహిస్తున్నారని, వారిని ఈ చిత్రంలో కించపర్చడం తగదని ఆయన పేర్కొన్నారు.

వెంటనే సన్నివేశాలు తొలగించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామన్నారు. సమావేశంలో స్థానిక కాటికాపర్ల సంఘం ప్రతినిధులు జంగయ్య, పరుశురాం, సత్యనారాయణ, బాబురావు తదితరులు పాల్గొన్నారు.

ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే …ఈ చిత్రం మొదటిరోజు వరల్డ్ వైడ్‌గా 51 కోట్ల గ్రాస్‌ని కలెక్ట్ చేసినట్లుగా చిత్ర యూనిట్ అఫిషీయల్‌గా ఓ పోస్టర్‌‌ని రిలీజ్ చేసింది. తాజాగా రెండో రోజు కలెక్షన్స్‌ని కూడా కలిపి 2 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్‌ అంటూ మరో పోస్టర్‌ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

వారు రిలీజ్ చేసిన పోస్టర్‌లో వున్న లెక్కల ప్రకారం ‘స్పైడర్’ రెండు రోజులకు గానూ 72 కోట్ల గ్రాస్‌ని కలెక్ట్ చేసింది. ఈ లెక్కన రెండో రోజు ‘స్పైడర్’ కలెక్ట్ చేసిన మొత్తం 21 కోట్లు. ఇప్పుడు ఈ చిత్రానికి వీకెండ్ కూడా యాడ్ అయ్యింది కాబట్టి రాబోయే ఒకటి లేదా రెండు రోజుల్లో ‘స్పైడర్’ 100 కోట్ల క్లబ్‌లోకి చేరడం ఖాయం.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

లండన్ బాబులు

Now Showing

మహానుభావుడు SEP 29
స్పైడర్ SEP 27
జై లవ కుశ SEP 21
ARJUN REDDY AUG 25

Poll