టాలీవుడ్

ఫ్యాన్సీ నెంబర్ కోసం ఏడు లక్షలు పెట్టిన స్టార్ హీరో

prudviప్రముఖ మలయాళీ నటుడు పృథ్వీరాజ్‌ గుర్తున్నారా. మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్ హీరోగా వచ్చి ‘విలన్‌‌’ సినిమాలో ఆయన ఐశ్వర్యా రాయ్‌ భర్త పాత్రలో నటించారు కదా ఆయనే. ఆయన గురించిన ఓ వార్త ఇప్పుడు అంతటా హల్ చల్ చేస్తోంది. ఏమిటా వార్త అంటే… వేలంలో రూ.7 లక్షలు పెట్టి ఫ్యాన్సీ నంబర్‌ ప్లేట్‌ను కొనుక్కున్నారు.

పృథ్వీరాజ్‌కు కార్లంటే చాలా ఇష్టం. గతేడాది ఆయన లంబోర్గిని హరికేన్‌ కారును కొనుగోలు చేశారు. ఎంతో ముచ్చటపడి కొనుక్కున్న కారుకు ఫ్యాన్సీ నంబర్‌‌ను రిజస్ట్రేషన్‌ చేయించాలనుకున్నారు.కాగా..ఇటీవల ఎర్నాకులం ఆర్టీవో కార్యాలయంలో kl07cn అనే నంబర్‌ ప్లేట్‌ను వేలానికి పెట్టారు.

రూ.10,000 నుంచి మొదలైన వేలం పాట పృథ్వీరాజ్‌ పలికిన రూ.7 లక్షల వద్ద ఆగింది. ఈ lp580-2 మోడల్‌ లంబోర్గిని కారుకు 5.2 లీటర్‌ వీ10 ఇంజిన్‌ ఉంది. దీని ధర సుమారు రూ.3.25 కోట్లు ఉంటుంది. వివిధ రకాల మోడళ్లను బట్టి ధరలు ఉంటాయి. అన్ని హరికేన్‌‌ లంబోర్గిని కార్లకు 7 స్పీడ్‌ ట్విన్‌ క్లచ్‌ ఆటోమేటిక్‌ గేర్‌ బాక్సులు ఉంటాయి. పృథ్వీరాజ్‌ ఎక్కువగా మలయాళం, తమిళ చిత్రాల్లోనే నటించారు.

Comments

comments

Teaser

Latest

Song

Coming Soon

ఏ మంత్రం వేసావె MAR 9
కిరాక్ పార్టీ MAR 16
రంగస్థలం MAR 30
భరత్ అనే నేను APR 20
నా పేరు సూర్య MAY 4
కాలా APR

Now Showing

మనసుకు నచ్చింది FEB 16
అ! FEB 16
తొలిప్రేమ FEB 10
చలో FEB 2