టాలీవుడ్

నాలా తప్పు ఇంకెవరూ చేయవద్దంటూ ప్రదీప్ వీడియో

డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో దొరికిపోయిన అందరూ దాదాపు కౌన్సెలింగ్‌కు హాజరుకాగా, యాంకర్ ప్రదీప్ మాత్రం రాలేదు. ప్రదీప్‌ పోలీస్ కౌన్సెలింగ్‌కు గత మూడురోజులుగా హాజుకాకపోవడంతో అతని కోసం ఇళ్లు, కార్యాలయంలో పోలీసులు ఆరా తీసినా అందుబాటులోకి రాలేదని సమాచారం. ప్రదీప్ పరారయ్యాడని, జైలు శిక్ష పడుతోండని కౌన్సెలింగ్‌కు హాజరుకావడం లేదని ప్రచారం అవుతుండగా తన గురించి ఆందోళన చెందవద్దని.. త్వరలోనే లా ప్రొసీడింగ్స్ ఫాలో అవుతానంటూ ఓ వీడియోను ప్రదీప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ఆ వీడియోలో ప్రదీప్ ఏమన్నారంటే.. ‘అందరికీ నమస్కారం.. నేను మీ ప్రదీప్ మాచిరాజు. డిసెంబర్ 31 అర్ధరాత్రి ఏం జరిగిందో అందరికీ తెలుసు. దాని తర్వాత జరిగే ప్రతి ప్రొసీడింగ్స్‌ను చట్ట ప్రకారమే ఫాలో అవుతాను. నాకు వచ్చిన సూచనల ప్రకారం పోలీస్ కౌన్సెలింగ్ కానీ, దాని తర్వాత జరిగే ప్రతి ప్రొసీడింగ్‌కు హాజరు అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాను. అయితే ఈలోగా నేను ముందుగానే కమిట్ అయిన ప్రోగ్రామ్స్, ఇతర ఈవెంట్ల షూటింగ్స్‌తో బిజీగా ఉన్నాను. అందువల్ల నేను అందుబాటులో లేనంటూ కొందరు ఆందోళన చెందుతున్నారు. తెలియజేసేది ఏమంటే షూటింగ్స్‌తో బిజీగా ఉండటం వల్లనే కౌన్సెలింగ్‌కు హాజరుకాలేకపోయాను.

కంటిన్యూగా ఫోన్ మోగడం వల్ల కొన్ని ఇంపార్టెంట్ కాల్స్ మిస్ అయుండొచ్చు. దయచేసి మీడియా మిత్రులకుగానీ, ప్రేక్షకులకు గానీ తెలియజేయడం ఏమనగా.. చట్ట ప్రకారం అన్ని ప్రొసీడింగ్స్ ఫాలో అవుతాను. గతేడాది డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి ఓ వీడియో గురించి చెప్పాను. అవును.. దురదృష్టవశాత్తూ నేను అందులో లభించాను. నేను తెలియజేసేది ఏమంటే.. నేను చేసిన తప్పు ఇంకెవరూ చేయకూడదని కోరుకుంటున్నాను. అందరూ నన్ను అర్థం చేసుకుంటారని భావిస్తున్నానంటూ’ ప్రదీప్ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Comments

comments

Trending

Latest

Song

Coming Soon

అజ్ఞాతవాసి JAN 10
జై సింహ JAN 12
చలో FAB 2
తొలిప్రేమ FAB 9

Now Showing

ఒక్క క్షణం DEC 28
MCA DEC 21
హలో DEC 22
మళ్ళీ రావా DEC 8
జవాన్ DEC 1

Poll