టాలీవుడ్

బిజీగా ఉన్నా టైం ఇవ్వండంటూ కోర్టుకు రిక్వెస్ట్

pradeepడిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో దొరికిపోయిన అందరూ దాదాపు కౌన్సెలింగ్‌కు హాజరుకాగా, యాంకర్ ప్రదీప్ మాత్రం రాలేదు. అయితే తాను షూటింగ్‌ కార్యక్రమాల్లో బిజీగా ఉండలం వల్ల కోర్టుకు హాజరు కాలేక పోతున్నానని, మరో రెండు రోజులు గడువు ఇవ్వాలంటూ పోలీసులకు విజ్ఞప్తి చేశాడు. ప్రదీప్‌ వినతిని పరిగణలోకి తీసుకున్న హైదరాబాద్‌ పోలీసులు రెండు రోజుల అనంతరం విచారణకు హాజరవ్వాలని ఆదేశించారు.

ప్రదీప్‌ పోలీస్ కౌన్సెలింగ్‌కు హాజరుకాకపోవడంతో అతని కోసం ఇళ్లు, కార్యాలయంలో పోలీసులు ఆరా తీసినా అందుబాటులోకి రాలేదని సమాచారం. ప్రదీప్ పరారయ్యాడని, జైలు శిక్ష పడుతోండని కౌన్సెలింగ్‌కు హాజరుకావడం లేదని ప్రచారం అవుతుండగా తన గురించి ఆందోళన చెందవద్దని.. త్వరలోనే లా ప్రొసీడింగ్స్ ఫాలో అవుతానంటూ ఓ వీడియోను ప్రదీప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ఈ నేపథ్యంలో ప్రదీప్‌ కౌన్సిలింగ్‌కు వస్తాడా? రాడా? అనే విషయం తెలియక పోలీసులు సైతం డైలమోలో పడ్డారు. అయితే తాను ఎక్కడికీ వెళ్లలేదని, షూటింగ్‌ ఉండటం వల్లనే హాజరు కాలేకపోయానని ప్రదీప్‌ తెలిపాడు. ఈ నెల 8వ తేదీన తన తం‍డ్రితో కలిసి గోషామహల్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌కు హాజరయ్యాడు. కౌన్సిలింగ్‌లో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ వల్ల కలిగే అనర్థాలు వివరించడంతోపాటు.. మరోసారి తాగి వాహనం నడుపవద్దంటూ ప్రదీప్‌కు పోలీసుల సూచనలు ఇచ్చారు.

Comments

comments

Trending

Latest

Song

Coming Soon

tr> tr> tr> tr> tr> tr>
జై సింహ JAN 12
రంగుల రాట్నం JAN 12
గ్యాంగ్ JAN 12
మనసుకు నచ్చింది JAN 26
చలో FAB 2
తొలిప్రేమ FAB 9
భాగమతి
ఆచారి అమెరికా యాత్ర
టచ్ చేసి చూడు

Now Showing

అజ్ఞాతవాసి JAN 10

Poll