టాలీవుడ్

ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పుడీ పత్రిక కోసం క్యూ

 

prabhas‘బాహుబలి’తో దుమ్మురేపిన ప్రభాస్‌ కొత్త సంవత్సరం సందర్భంగా తన అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ప్రముఖ మ్యాగజీన్‌ జీక్యూ ఇండియా జనవరి ఎడిషన్‌ కవర్‌పేజీపై ప్రభాస్‌ స్టైలిష్‌ లుక్‌లో దర్శనమిచ్చాడు. జనవరి ఎడిషన్ కవర్ పేజీ పై రాయల్ లుక్ తో పోజు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ప్రభాస్‌ ముఖచిత్రంతో కూడిన ఎడిషన్‌ను ప్రచురించింది . బ్లూపిన్‌ స్ట్రిప్‌డ్‌ త్రిపీజ్‌ సూట్‌తో కాలు మీద కాలు వేసుకొని రాయల్‌ లుక్‌తో ప్రభాస్‌ కవర్‌పేజీకి పోజు ఇచ్చాడు.

‘సంచలన విజయం సాధించిన ’బాహుబలి’ స్టార్‌ ప్రభాస్‌ ఆశ్చర్యకరంగా ఒక సిగ్గరి. 2018లో రాబోయే మా మొదటి ఎడిషన్‌లో ఆయన గురించి కొన్ని విశేషాలు మేం అందించబోతున్నాం. జనవరి 2018 ఎడిషన్‌ను మిస్‌ కాకండి’ అంటూ జీక్యూ మ్యాగజీన్‌ ట్విట్టర్‌లో పోస్టుచేసింది.

ఎస్‌ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సినిమాలతో ప్రభాస్‌ దేశవ్యాప్తంగా సూపర్‌స్టార్‌ అయ్యిన ప్రభాస్… దేశంలోని ప్రతి ఒక్కరికీ చేరువయ్యాడు. ఈ నేపథ్యంలో న్యూఇయర్‌ తొలి ఎడిషన్‌లోనే ప్రభాస్‌ ముఖచిత్రంతో జీక్యూ మ్యాగజీన్‌ కథనాన్ని ప్రచురించటం ఫ్యాన్స్ కు పండగలా మారింది.

Comments

comments

Trending

Latest

Song

Coming Soon

అజ్ఞాతవాసి JAN 10
జై సింహ JAN 12
చలో FAB 2
తొలిప్రేమ FAB 9

Now Showing

ఒక్క క్షణం DEC 28
MCA DEC 21
హలో DEC 22
మళ్ళీ రావా DEC 8
జవాన్ DEC 1

Poll