టాలీవుడ్

ప్రభాస్ ‘దందా’..ఫ్యాన్స్ కంగారు ?

prabhasప్రభాస్ – కృష్ణంరాజు కలయికలో ఓ చిత్రం రాబోతోదంటూ చాలా కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే అవి ఇన్నాళ్లకు నిజం రూపం దాల్చనున్నట్లు సమాచారం .యస్… త్వరలోనే ప్రభాస్ , కృష్ణంరాజు కలిసి పనిచేయబోతున్నారు.. కృష్ణంరాజు దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కబోతుందని సమాచారం. అందుతున్న సమాచారం మేరకు ఆ చిత్రానికి ‘దందా’ అనే టైటిల్ ను ఖరారు చేశారు.. ఇటీవలే ఈ టైటిల్ ను ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ సైతం చేయించారు.

ఎప్పటినుండో ప్రభాస్ చిత్రానికి దర్శకత్వం వహించాలనే కోరిక ఉన్న కృష్ణంరాజుకు ఈ చిత్రంతో ఆ కోరిక నెరవేరబోతుంది. అయితే బాహుబలి చిత్రం తో అంతర్జాతీయంగా ఎనలేని పేరు తెచ్చుకున్న ప్రభాస్ కెరీర్ పై ఈ చిత్రం ఏ మేరకు ప్రభావం చూపుతుందో అని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. ఈ మేరకు కొందరు ఫ్యాన్స్ ..ప్రబాస్ ని కలిసి ఈ విషయమై డిస్కస్ చేయనున్నారనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో ‘సాహో’ చిత్రం చేస్తున్న ప్రభాస్ ఆ తరువాత ఈ చిత్రంలో నటించే అవకాశముంది. ఈ చిత్రాన్ని కృష్ణంరాజు సొంత బ్యానర్ గోపికృష్ణ మూవీస్ , ప్రభాస్ బ్యానేర్ యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Comments

comments

Teaser

Latest

Song

Coming Soon

నా పేరు సూర్య MAY 4
కాలా

Now Showing

భరత్ అనే నేను APR 20
కృష్ణార్జున యుద్ధం APR 12
ఛల్ మోహన్ రంగ APR 5
రంగస్థలం MAR 30
నీదీ నాదీ ఒకే కథ MAR 23
MLA MAR 23
కిరాక్ పార్టీ MAR 16