గాసిప్స్

ఇంతకీ ప్రభాస్ ఓకే చేసాడా..గాలి కబుర్లేనా?

prabhasప్రభాస్ కెరీర్ లో ప్రతిష్టాత్మక చిత్రం ‘బాహుబలి’ ఘన విజయం తర్వాత ‘సాహో’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. దీనికి సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రద్ధాకపూర్‌ హీరోయిన్ పాత్ర పోషిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా తర్వాత ప్రభాస్‌ ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో నటించే అవకాశాలు ఉన్నాయని తమిళ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో సినిమా విషయమై చర్చలు జరిపినట్లు చిత్ర వర్గాల సమాచారం. అన్ని కుదిరితే 2018లో సినిమాను ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించి చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి సమాచారం లేదు.

బాహుబలి సినిమాతో ప్రభాస్ కి తెలుగు, తమిళ్, హిందీలోనూ క్రేజ్ ఏర్పడింది. దీంతో ప్రభాస్ తో సినిమా తీస్తే.. మూడు బాషల్లో ఏకకాలంలో తీయొచ్చని మురగదాస్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం మహేష్ తో ‘స్పైడర్’ తెరకెక్కిస్తోన్న మురగదాస్ తన తదుపరి సినిమాని విజయ్ తో చేయనున్నాడు. ఆ తర్వాత సినిమా కచ్చితంగా ప్రభాస్ తో ఉంటుందని చెబుతున్నారు. తెలుగు, తమిళ్, హిందీ బాషల్లో ప్రభాస్ హీరో మురగదాస్ ఓ భారీ ప్రాజెక్ట్ ని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారమ్.

ఏఆర్‌ మురుగదాస్‌ ప్రస్తుతం మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న ‘స్పైడర్‌’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్. హ్యారిస్‌ జైరాజ్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. సెప్టెంబరు 27న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో చిత్రం విడుదల కాబోతోంది.

Comments

comments

Latest

Recent

Songs

Coming Soon

జై లవ కుశ SEP 21
స్పైడర్ SEP 27
లండన్ బాబులు

Now Showing

యుద్ధం శరణం SEP 8
మేడమీదా అబ్బాయి SEP 8
పైసా వసూల్ SEP 1
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18
నేనే రాజు నేనే మంత్రి AUG 11
జయ జానకి నాయక AUG 11

Poll