టాలీవుడ్

కత్తి మహేష్ కు సపోర్ట్ గా పూనమ్ కౌర్

katti-mahesh-punam-kaurప‌వ‌న్‌ కళ్యాణ్ కు మ‌ద్ద‌తుగా ట్వీట్లు చేసింద‌న్న కార‌ణంతో హీరోయిన్ పూన‌మ్ కౌర్ వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించిన అంశాల‌ను కత్తి మహేష్ కొన్ని ప్ర‌శ్న‌ల ద్వారా మీడియా ముందుంచిన సంగతి తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ క‌త్తి మ‌హేష్‌కు, ఆయ‌న త‌ల్లికి మ‌ద్ద‌తుగా పూన‌మ్ ఓ ట్వీట్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఆదివారం జ‌రిగిన మహా టీవి వారి చ‌ర్చా కార్య‌క్ర‌మంలో డైరెక్షన్ డిపార్టమెంట్ కు చెందిన వివేక్ అనే వ్యక్తి.. క‌త్తి మ‌హేష్ త‌ల్లి గురించి ప్ర‌శ్న‌లు లేవ‌నెత్తాడు. ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్ప‌డం ఇష్టం లేక క‌త్తి మ‌హేష్ అక్క‌ణ్నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశాడు. దీంతో సోష‌ల్ మీడియాలో కత్తి మ‌హేష్ త‌ల్లి గురించి ట్వీట్లు, కామెంట్లు ఎక్కువ‌య్యాయి.

అయితే వీటి గురించి పూన‌మ్ స్పందిస్తూ.. `ఎవ‌రైనా కానీ, ఓ వ్య‌క్తి త‌ల్లిని కించ‌ప‌రుస్తూ ఎవ‌రూ మాట్లాడ‌కూడ‌దు. ద‌య‌చేసి ఆమె గురించి మాట్లాడ‌కండి` అని పూన‌మ్ ట్వీట్ చేసింది.

పూనమ్ కౌర్ తో వివాద విషయంలోకి వస్తే…

పవన్ కు మద్దతుగా హీరోయిన్ పూన‌మ్ కౌర్…కొద్ది రోజుల క్రితం…. మహేష్ పై విమ‌ర్శలు చేసింది. ఇత‌రుల‌ను విమ‌ర్శించ‌డం ద్వారా డ‌బ్బులు సంపాదించాలనుకునే వారి కంటే అడుక్కునే వారు ఎంతో ఉత్త‌ములంటూ త‌న ట్విట్ట‌ర్‌లో తీవ్ర వ్యాఖ్య‌లు చేసింది. ‘ఆ ఫ్యాట్సోను రోజూ టీవీలో చూసి బోర్ కొడుతోంది. పాపం.. నిరుద్యోగ స‌మ‌స్య‌… ఎవ‌రో అనారోగ్యంతో బాధ‌పడుతున్నారు. ఆయ‌న‌కు డ‌బ్బులు డొనేట్ చేయండి. మ‌న‌కు వ్య‌తిరేకంగా మాట్లాడుతున్న వారికి కూడా మ‌నం ఆహారం అందిస్తున్నాం. ఇది చాలా గొప్ప విష‌యం. అత‌నికి మంచి పని దొర‌కాల‌ని కోరుకుంటున్నాను’ అని మహేష్ ని ఉద్దేశిస్తూ ఆమె వ‌రుస‌గా ట్వీట్లు చేసింది.

ఈ క్రమంలో స‌ద‌రు హీరోయిన్‌కి కూడా క‌త్తి మహేష్అదే స్థాయిలో కౌంట‌ర్ ఇచ్చారు. స‌ద‌రు హీరోయిన్ త‌న‌ను ఫ్యాట్సో అంటూ మాట్లాడ‌డంతోనే ఆమె సంస్కారం ఏంటో తెలిసిపోతోంద‌ని ఓ ఇంట‌ర్వ్యూలో మహేష్ విమ‌ర్శించారు. పవన్ క‌ల్యాణ్ చేసిన సాయంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ చేనేత బ్రాండ్‌ అంబాసిడర్ గా ఆమె ఎంపికైంద‌ని అన్నారు. ప‌వ‌న్‌ మెప్పు కోసం తనపై ఇటువంటి వ్యాఖ్య‌లు చేస్తోంద‌ని తెలిపారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌ల్ల ఆమెకు ఉద్యోగం వ‌చ్చింద‌ని, ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆమెకు బ‌తుకుదెరువు చూపించినందుకు ఆమె త‌న‌పై విమ‌ర్శ‌లు చేస్తోంద‌ని అన్నారు.

‘ప‌వ‌న్ క‌ల్యాణ్‌కి నాలుగో భార్య అవ్వ‌డానికి రెడీ అని హీరోయిన్‌ పూనం కౌర్ అన్నారు. ఆమె రెండు మూడు ఇంట‌ర్వ్యూల్లో ఈ విష‌యాన్ని తెలిపింది. కావాలంటే యూ ట్యూబ్‌లో ఆమె ఇచ్చిన ఇంట‌ర్వ్యూల‌ను చూసుకోండి’ అని క‌త్తి మహేష్అన్నారు. తాను కూడా తీవ్ర వ్యాఖ్యలు చేయగలనని హెచ్చరించారు. తాను పాప్యులర్ కావడానికే పవన్ కల్యాణ్ పై విమర్శలు చేస్తున్నానని కొందరు అంటున్నారని, తనకు ఆ అవసరం లేదని కత్తి మహేష్ స్పష్టం చేశారు.

Comments

comments

Teaser

Latest

Song

Coming Soon

నా పేరు సూర్య MAY 4
కాలా

Now Showing

భరత్ అనే నేను APR 20
కృష్ణార్జున యుద్ధం APR 12
ఛల్ మోహన్ రంగ APR 5
రంగస్థలం MAR 30
నీదీ నాదీ ఒకే కథ MAR 23
MLA MAR 23
కిరాక్ పార్టీ MAR 16