టాలీవుడ్

పూనమ్ కౌర్ విషయమై మంత్రి ప్రకటన

Poonam-Kaur-Stills-At-Nakshatram-Movie-Audio-Launch-04ఏపీలో చేనేత వస్త్రాలకు నటి పూనమ్‌కౌర్‌ను జనసేన అధినేత పవన్ కల్యాణ్ సిఫార్స్‌తోనే బ్రాండ్ అంబాసిడార్‌గా నియమించారని కత్తి మహేష్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రస్తుతం రగడ జరుగుతోంది. పూనమ్ వ్యక్తిగత విషయాలను బయటపెడుతూ ఆరు ప్రశ్నలు సంధించిన విషయం తెలిసిందే. కత్తి మహేష్ ప్రశ్నలపై సోషల్‌మీడియాతో పాటు ఇండస్ట్రీలోనూ విపరీతమైన చర్చ జరుగుతోంది.

ఈ విషయమై పై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర సంచలన ప్రకటన చేశారు. తాను చేనేత శాఖకు మంత్రిగా ఉన్న సమయంలో చేనేత వస్త్రాలకు సంబంధించి ఎవరినీ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించలేదని స్పష్టం చేశారు. అసలు ప్రభుత్వ పరంగా అలాంటి నియామకమే జరగలేదని ఆయన అన్నారు.

ప్రభుత్వ పరంగా అంబాసిడర్‌ను నియమించాలనే చర్చ జరగలేదని, కొంతమంది చేనేత సంఘ సభ్యులు పవన్‌ కల్యాణ్‌ను అంబాసిడర్‌గా ఉండాలని చెప్పి ఆయనను కలిసి కోరారని తెలిపారు. అంతే తప్ప.. చేనేత వస్త్రాలకు సంబంధించి ఎవరినీ బ్రాండ్ అంబాసిడార్‌గా నియమించలేదని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.

Comments

comments

Teaser

Latest

Song

Coming Soon

నా పేరు సూర్య MAY 4
కాలా

Now Showing

భరత్ అనే నేను APR 20
కృష్ణార్జున యుద్ధం APR 12
ఛల్ మోహన్ రంగ APR 5
రంగస్థలం MAR 30
నీదీ నాదీ ఒకే కథ MAR 23
MLA MAR 23
కిరాక్ పార్టీ MAR 16