టాలీవుడ్

‘అర్జున్ రెడ్డి’పై పోలీస్ కంప్లైంట్, వర్మ సపోర్ట్

arjunreddy-rgvఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రానున్న ‘అర్జున్ రెడ్డి’ సినిమా పోస్టర్లు అసభ్యంగా ఉన్నాయంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఓ ఆర్టీసీ బస్సుపై ఉన్న ‘అర్జున్ రెడ్డి’ పోస్టర్ ను ఆ బస్సు కండక్టర్ సాయంతో తొలగించే ప్రయత్నం ఆయన చేయడం విదితమే. దీనిపై స్పందించిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా హీరో విజయ్ దేవరకొండ ‘తాతయ్యా…చిల్’ అంటూ తన ట్విట్టర్ ఖాతాలో ఇటీవల పేర్కొన్నాడు.

ఇక ‘అర్జున్ రెడ్డి’ సినిమా పోస్టర్ పై బీసీ యువజన సంఘం నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అసభ్యకరమైన పోస్టర్ ను చిత్రీకరించిన ‘అర్జున్ రెడ్డి’ చిత్ర నిర్మాత, దర్శకుడు, హీరో, హీరోయిన్లపై తగిన చర్యలు తీసుకోవాలంటూ బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కనకాల శ్యామ్ కురుమ ఈ రోజు మలక్ పేట పోలీసులకు ఫిర్యాదు చేారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ, యువతను తప్పుదోవ పట్టించేలా చిత్రీకరించిన ఈ వాల్ పోస్టర్లను తొలిగించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. విద్యా సంస్థలు, ప్రధాన కూడళ్లు, బస్టాండ్ ప్రాంతాల్లో ఈ సినిమాకు సంబంధించిన అసభ్యకర వాల్ పోస్టర్లు దర్శనమిస్తున్నాయని, యువతను ఆకర్షించేందుకు విష సంస్కృతిని ప్రదర్శిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సినిమా విడుదల కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. శ్యామ్ కురుమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, చట్ట రీత్యా తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

వర్మ సపోర్ట్…

ఈ నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన దైన శైలిలో ‘అర్జున్ రెడ్డి’కి మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. బస్సుపై ఉన్న‘అర్జున్ రెడ్డి’ పోస్టర్ ను తొలగిస్తున్న వి.హనుమంతరావు ఫొటోను తన ‘ఫేస్ బుక్’ ఖాతాలో పోస్ట్ చేసిన వర్మ .. ‘మీ పార్టీ తాతయ్య అయిపోయింది. ఇప్పుడు, మీ పిల్ల చేష్టల ద్వారా ప్రజలు, మనవళ్లు, మనవరాళ్లు వచ్చే ఎన్నికల్లోనూ ఆ తర్వాత కూడా ఓటు వెయ్యరు. దీంతో, మీరు, మీ పార్టీ డబుల్ తాతయ్య అయిపోతారు.

తాతయ్యా..‘అర్జున్ రెడ్డి’ పోస్టర్ లో ఏమైనా తప్పు ఉందేమో మీ మనవళ్లను, మనవరాళ్లను అడగండి? ‘అర్జున్ రెడ్డి’ సినిమా కచ్చితంగా మనవళ్లు, మనవరాళ్ల కోసమే కానీ, పాత ఆలోచనా ధోరణిలో ఉండే తాతయ్యల కోసం కాదు.. జస్ట్ చిల్’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Comments

comments

Latest

Recent

Songs

Coming Soon

జై లవ కుశ SEP 21
స్పైడర్ SEP 27
లండన్ బాబులు

Now Showing

యుద్ధం శరణం SEP 8
మేడమీదా అబ్బాయి SEP 8
పైసా వసూల్ SEP 1
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18
నేనే రాజు నేనే మంత్రి AUG 11
జయ జానకి నాయక AUG 11

Poll