కోలీవుడ్

వేధిస్తున్నాడంటూ హాస్య నటుడుపై భార్య పోలీస్ కంప్లైంట్

Anchor-and-actor-Thadi-Balaహాస్య నటుడు దాడి బాలాజీ భార్య నిత్య అతని నుంచి విడాకులు కోరుతూ చెన్నై కుటుంబ సంక్షేమ కోర్టును ఆశ్రయించిన విషయం చెన్నై ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తమిళ సినిమాల్లోనే కాకుండా, పలు బుల్లితెర సీరియళ్ళలో కూడా దాడి బాలాజీ నటిస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు. అయితే బాలాజీకి, అతని భార్య నిత్యకు మధ్య కొన్ని నెలలుగా మనస్పర్థలు ఏర్పడడంతో వేర్వేరుగా జీవిస్తున్నారు. తన భర్త నిత్యం కొడుతూ చిత్రహింసలకు గురి చేస్తున్నాడంటూ నిత్య ఇటీవల చెన్నై పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది.

ఆ తర్వాత వారిద్దరిని పిలిచి చర్చలు జరిపిన పోలీసులు కుటుంబ వ్యవహారం కావడంతో భార్యాభర్తలిద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవాలని సూచించారు. ఆ తరువాత బాలాజీ కూడా కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. అందులో.. తన భార్యను ఒక సబ్‌ ఇన్‌స్పెక్టర్, జిమ్‌ నిర్వాహకుడు బెదిరింపులకు గురి చేస్తున్నారని పేర్కొన్నాడు.

తన భార్య నిత్యతో కలిసి జీవించేందుకు ఇష్టపడుతున్నాను. కానీ, ఓ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ , సినిమా జిమ్‌ ట్రైనర్‌ తన భార్యతో కలిసి జీవించకుండా అడ్డుపడుతున్నారని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదే విషయంపై దాడి బాలాజీ గురువారం విలేకరులతో మాట్లాడుతూ… తామిద్దరం ఎంతో సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తూ వచ్చామని, కానీ, గత ఆరు నెలలుగా తమ మధ్య మనస్పర్థలు వచ్చాయన్నారు. అయితే, ఇరు కుటుంబాల పెద్దలు తమను ఒక్కటి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు.

కానీ, ఫేస్‌బుక్‌ ద్వారా ఓ ఎస్‌ఐ, జిమ్‌ ట్రైనర్‌ తన భార్యను బెదిరిస్తున్నారని ఆయన వెల్లడించారు. ఆ ట్రైనర్‌తో సంబంధాలు తెంచుకోవాలని భార్య నిత్యను పలుమార్లు హెచ్చరించినా పెడచెవిన పెట్టిందన్నారు. ఈ కారణంగానే తమ మధ్య మనస్పర్థలు తారా స్థాయికి చేరాయని చెప్పుకొచ్చారు. భార్యాభర్తల మధ్య ఉన్న గొడవల వల్ల అన్యంపుణ్యం తెలియని తమ కుమార్తె కష్టపడుతోందని, అందువల్ల తాను తన భార్యతో కలిసి జీవించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

లండన్ బాబులు

Now Showing

మహానుభావుడు SEP 29
స్పైడర్ SEP 27
జై లవ కుశ SEP 21
ARJUN REDDY AUG 25

Poll