బాక్స్ ఆఫీస్

‘అజ్ఞాతవాసి’కలెక్షన్స్ పరిస్దితి అంత దారుణమా?

pawan-agnata1ప‌వ‌న్ క‌ల్యాణ్ – త్రివిక్రమ్ కాంబినేష‌న్‌లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘అజ్ఞాతవాసి’ చిత్రం మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ‘అజ్ఞాతవాసి’ ప్లాప్ మూవీగా రివ్యూలు ఒక్క మాటలో తేల్చేస్తుండగా…పవన్ వీరాభిమానులు మాత్రం సినిమా బాగుందని సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. ‘అజ్ఞాతవాసి’పై ప్రేక్షకుల్లో టాక్ ఎలా ఉన్నా ఓపనింగ్ క‌లెక్షన్లు మాత్రం అదిరిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, ఓవర్సీస్ కలెక్షన్లలో జోరు కొనసాగింది.

అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం కలెక్షన్స్ రెండో రోజుకు దాదాపు అన్ని చోట్లా డ్రాప్ అయ్యిపోయింది. ఇది ఎవరూ ఊహించని పరిణామం. కొన్ని సెంటర్లలో రిలీజ్ రోజు మాట్నీకే …జనం పెద్దగా కనిపించలేదు. దాంతో సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్స్ లాభాల మాట అటుంచి, మినిమం నష్టాలతో అయినా బయిటపడితే చాలు అనుకుంటున్నట్లు గా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.

అయితే ఆంధ్ర ప్రదేశ్ లో దాదాపు అన్ని సెంటర్స్ లో అర్ధరాత్రి నుంచే ప్రీమియర్ షోలు మొదలు పెట్టడం – అధికారికంగానే ఏడు ఆటలకు అనుమతి లభించడంతో పాటు 200 రూపాయల దాకా టికెట్ అమ్ముకునే వెసులుబాటు కలిగించడం అజ్ఞాతవాసికి బాగా హెల్ప్ చేసాయి.

ట్రేడ్ వర్గాల అంచ‌నాల ప్రకారం ఓవ‌ర్సీస్‌లో 570 థియేట‌ర్లలో విడుద‌లై వ‌న్ మిలియ‌న్ మార్క్ దాటినట్లు చెబుతున్నారు. 481 లొకేషన్స్ లో 1.3 మిలియన్ డాలర్లును దాటిన‌ట్లు తెలుస్తోంది. దీంతో బాహుబ‌లి-2 మినహా మిగిలిన రికార్డ్‌ల‌ను బ్రేక్ చేసి రెండవ స్థానంలో అజ్ఞాతవాసి నిలిచింది. బాహుబలి పార్ట్ 1 వసూళ్లను దాటేసిన అజ్ఞాతవాసి ఇక ఖైదీ నంబర్ 150 రమారమీ 1.29 మిలియన్ డాలర్ల వసూళ్లను సాధించింది.

ఓపనింగ్ కలెక్షన్స్ బాగున్నా…ముందుముందు కలెక్షన్లు ఎలా ఉండనున్నాయన్నది ట్రేడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారుతోంది.

Comments

comments

Teaser

Latest

Song

Coming Soon

నా పేరు సూర్య MAY 4
కాలా

Now Showing

భరత్ అనే నేను APR 20
కృష్ణార్జున యుద్ధం APR 12
ఛల్ మోహన్ రంగ APR 5
రంగస్థలం MAR 30
నీదీ నాదీ ఒకే కథ MAR 23
MLA MAR 23
కిరాక్ పార్టీ MAR 16