టాలీవుడ్

ఫ్యాన్స్ కు పవన్ వీడియో

అమెరికాలో అత్యధిక థియేటర్స్ లో విడుదలవుతున్న తొలి భారతీయ మూవీగా రికార్డు సాధించిన అజ్ఞాతవాసి అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో ఉన్న‌ యూనివర్శల్ స్టూడియోస్‌లోని సిటీ వాక్ థియేటర్స్‌లో ప్రదర్శించబోయే తొలి భారతీయ చిత్రంగా గుర్తింపు తెచ్చుకోనుంది . సినిమా రిలీజ్ త‌ర్వాత ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులు చెరిపేస్తుంద‌ని ప‌వ‌న్ అభిమానులు భావిస్తున్నారు. జ‌న‌వ‌రి 10న విడుద‌ల కానున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం ఓవ‌ర్సీస్‌లో మొత్తం 570 లొకేష‌న్స్‌లో విడుద‌ల కానుంది.

అయితే ఏ ఇండియ‌న్ చిత్రం కూడా విడుద‌ల కాన‌న్ని థియేట‌ర్స్‌లో అజ్ఞాత‌వాసి చిత్రం ఓవ‌ర్సీస్‌లో విడుద‌ల కానుండ‌డంతో ప‌వ‌న్ ఒకింత ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తూ ఆనందానికి లోన‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఓ వీడియో విడుదల చేసారు.

ఈ వీడియో ద్వారా ప్ర‌వాస భార‌తీయుల‌కి అన్ని వేళ‌లా అండ‌గా ఉంటాన‌ని తెలుపుతూ, అజ్ఞాత‌వాసి చిత్రాన్ని ఇంత పెద్ద మొత్తాన విడుద‌ల చేస్తున్నందుకు ప్ర‌తి ఒక్క భారతీయుడికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.జ‌ల్సా, అత్తారింటికి దారేది వంటి చిత్రాలు అందించిన ప‌వన్‌- త్రివిక్రమ్ కాంబో అజ్ఞాత‌వాసి చిత్రంతో హ్య‌ట్రిక్ కొడుతుందని అంటున్నారు. జ‌న‌వ‌రి 9న ఓవ‌ర్సీస్‌లో విడుద‌ల కానున్న అజ్ఞాతవాసి చిత్రం జ‌న‌వ‌రి 10న తెలుగు రాష్ట్రాల‌లో రిలీజ్ కానుంది.

Comments

comments

Trending

Latest

Song

Coming Soon

అజ్ఞాతవాసి JAN 10
జై సింహ JAN 12
చలో FAB 2
తొలిప్రేమ FAB 9

Now Showing

ఒక్క క్షణం DEC 28
MCA DEC 21
హలో DEC 22
మళ్ళీ రావా DEC 8
జవాన్ DEC 1

Poll