టాలీవుడ్

‘కొడకా కోటేశ్వరావా’ సాంగ్ …సినిమాలో వచ్చే సందర్భం ఏంటంటే

‘అజ్ఞాతవాసి’ సినిమాలోని ‘కొడకా కోటేశ్వరరావు..’ అనే పాటను పవన్‌ ఆలపించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ పాట టీజర్‌ను విడుదల చేస్తే అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కాగా నూతన సంవత్సర ప్రారంభం సందర్భంగా పూర్తి పాటను ఆదివారం సాయంత్రం చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇక ఈ పాట హీరో పనిచేసే సాప్ట్ వేర్ ఆఫీస్ లో ..ఉన్న కోటీశ్వరరావు అనే క్యారక్టర్ లెస్ ఫెలో అని టీజ్ చేస్తూ పాడిన పాట ఇది.

‘బాబూ తుకారం ఒక గ్లాసు మిరియాల పాలు.. కర్చు అనుకోకపోతే రెండు యాలక్కాయలు కూడా తగిలించవోయ్‌ కుమ్మేద్దాం.. కొడకా కోటేశ్వరరావా..శర్మగారు నేను ఏమి పాడుతున్నాను. మీరేమి వినిపిస్తున్నారు..’ అంటూ హుషారుగా మొదలైన ఈ పాట అభిమానులకు పవన్‌ కానుకనే చెప్పొచ్చు.

పవన్‌ గతంలో ‘అత్తారింటికి దారేది’ సినిమాలోని ‘కాటమరాయుడా కదిరి నరసింహుడా..’ అనే పాట పాడి ప్రేక్షకుల్ని అలరించారు. అప్పట్లో ఈ పాట అంద‌రి నోటా నానింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఇప్పడు మళ్లీ ‘కొడకా కోటేశ్వరరావు..’ అదే ట్రెండ్‌ను సృష్టించేలా ఉంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం అజ్ఞాతవాసి. జల్సా, అత్తారింటికి దారేది లాంటి సూపర్ హిట్ సినిమాలు అందించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా కావటంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు.

Comments

comments

Trending

Latest

Song

Coming Soon

అజ్ఞాతవాసి JAN 10
జై సింహ JAN 12
చలో FAB 2
తొలిప్రేమ FAB 9

Now Showing

ఒక్క క్షణం DEC 28
MCA DEC 21
హలో DEC 22
మళ్ళీ రావా DEC 8
జవాన్ DEC 1

Poll