టాలీవుడ్

పవన్ కొత్త ఇల్లు , శంఖు స్దాపన అయ్యింది

pawan dfghdనవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సొంత ఇంటి నిర్మాణానికి పవన్ సిద్ధమయ్యారు. గుంటూరు జిల్లా కాజా దగ్గర రెండెకరాల పరిధిలో సొంత ఇంటిని నిర్మించేందుకు జనసేనానికి ఈ రోజు భూమి పూజ చేసారు. ఐదో నంబరు జాతీయ రహదారి పక్కన పవన్ ఇంటి నిర్మాణ పనులు ఇప్పటికే కసరత్తు పూర్తయింది. ఆరునెలల్లో ఇంటి నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పవన్‌కల్యాణ్‌ ఆదివారం సాయంత్రమే విజయవాడ చేరుకున్నారు.pawa2

కాజ వద్ద దాదాపు రెండెకరాల విస్తీర్ణంలో ఇల్లు నిర్మాణానికి సంబంధించిన వ్యవహారాలను పవన్‌కల్యాణ్‌ ఒక ప్రైవేట్‌ నిర్మాణ సంస్థకు అప్పగించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. భూమి పూజకు పవన్‌ అత్యంత సన్నిహితులకే ఆహ్వానాలు పంపినట్లు సమాచారం.

మరో ప్రక్క నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో 14వ తేదీన జరగనున్న జనసేన ఆవిర్భావ దినోత్సవ సభకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు అర్బన్‌ ఎస్పీ విజయరావు తెలిపారు. ఆయన ఆదివారం సభ జరిగే ప్రాంతాన్ని సందర్శించి, పరిశీలకులతో సభా నిర్వహణ ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా సభ ప్రాంగంణం కలియదిరిగి భద్రతాపరంగా తీసుకోవాల్సిన చర్యలపై పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు, అభిమానులు వచ్చే అవకాశం ఉన్నందు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. బారికేడ్లు ఏర్పాటు చేసి క్రమపద్ధతిలో సభా ప్రాంగణంలోకి ప్రజలను అనుమతించాలని, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా తగు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. వేదికపై పరిమితికి మించి పంపకుండా చూడాలన్నారు.

Comments

comments

Needi Naadi Oke Katha

Trailer

Latest

Song

Coming Soon

రంగస్థలం MAR 30
భరత్ అనే నేను APR 20
కాలా APR 27
నా పేరు సూర్య MAY 4

Now Showing

నీదీ నాదీ ఒకే కథ MAR 23
MLA MAR 23
కిరాక్ పార్టీ MAR 16
ఏ మంత్రం వేసావె MAR 9
మనసుకు నచ్చింది FEB 16
అ! FEB 16
తొలిప్రేమ FEB 10
చలో FEB 2