Needi-Naadi-Oke-Katha-baner1
టాలీవుడ్

బుజ్జి ఫ్రెండ్ పాడిన పాటకు ఫిదా అయిన పవన్

కష్టమైనప్పటికీ.. తెలుగు మీద అభిమానంతో తెలుగు పాటలు పాడటం, డైలాగ్‌లను చెప్పటం.. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేయటం ద్వారా
పోలెండ్ చిన్నారి జిబిగ్జ్(బుజ్జి) వార్తల్లో నిలవటం చూస్తున్నాం.

తాజాగా పవన్‌ కళ్యాణ్‌ అజ్ఞాతవాసిలోని కొడకా కోటేశ్వర రావు పాటను పాడిన ఈ చిన్నారి.. మరోసారి హల్‌ చల్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ పిల్లాడి పాట ట్రెండ్‌ కావటంతో పవర్‌ స్టార్‌ అభిమానులు తెగ ఖుషీ అయ్యారు. చివరకు ఈ పిల్లగాడు పవన్‌ను కూడా ఫిదా చేసి పడేశాడు.

చిన్నారి పాట పాడిన విధానానికి ఇంప్రెస్ అయిన పవన్‌ .. ‘‘లిటిల్ ఫ్రెండ్.. నీ పాట నాకు చేరింది. నువ్వు ఇచ్చిన కొత్త సంవత్సరం కానుకకు కృత్ఞతలు. భగవంతుడు నిన్ను చల్లగా చూడాలి’’ అంటూ ట్వీట్‌ చేశాడు. ఇక జిజిగ్జ్ అయితే పాటతో కూడిన ఫోటోనే ట్విట్టర్‌లో ప్రొఫైల్‌ పిక్‌గా పెట్టుకోవటం విశేషం. గతంలో అఖిల్‌ హలో చిత్రంలోని పాటను కూడా పాడి నాగ్‌ను ఆకట్టుకున్న విషయం విదితమే.

‘అజ్ఞాతవాసి’ సినిమాలోని ‘కొడకా కోటేశ్వరరావు..’ అనే పాటను పవన్‌ ఆలపించిన సంగతి తెలిసిందే. ఈ పాట ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఇంతగా ఆదరణ పొందుతున్న ఈ పాటలో ఒక ఆసక్తికరమైన అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చగా మారింది. అదేమిటంటే..ఈ సినిమాలో కోటీశ్వరరావు పాత్రధారి ఎవరూ అని…

సాంగ్ చివర్లో వచ్చిన షాట్స్ ప్రకారం ‘కోటేశ్వరరావు’ అంటే మరెవరో కాదు రఘుబాబు అని తెలుస్తోంది. పవన్ పని చేసే సాప్ట్ వేర్ ఆఫీస్ లో రఘుబాబు…బాస్ గా కనిపిస్తాడని..అతన్ని ఉద్దేశించి స్టాప్ అందరితో కలిసి ఈ పాటను ఎత్తుకుంటాడని తెలుస్తోంది.

‘తమ్ముడు’లో మల్లి అంటూ మల్లికార్జునరావుని, జానిలో మందు పాట పాడి ఎమ్మెస్‌ నారాయణని, ‘అత్తారింటికి దారేది’లో బ్రహ్మానందాన్ని పవన్‌ ఇలానే ఆటపట్టించటం గమనించవచ్చు.

‘బాబూ తుకారం ఒక గ్లాసు మిరియాల పాలు.. కర్చు అనుకోకపోతే రెండు యాలక్కాయలు కూడా తగిలించవోయ్‌ కుమ్మేద్దాం.. కొడకా కోటేశ్వరరావా..శర్మగారు నేను ఏమి పాడుతున్నాను. మీరేమి వినిపిస్తున్నారు..’ అంటూ హుషారుగా మొదలైన ఈ పాట అభిమానులకు పవన్‌ కానుకనే చెప్పొచ్చు.

పవన్‌ గతంలో ‘అత్తారింటికి దారేది’ సినిమాలోని ‘కాటమరాయుడా కదిరి నరసింహుడా..’ అనే పాట పాడి ప్రేక్షకుల్ని అలరించారు. అప్పట్లో ఈ పాట అంద‌రి నోటా నానింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఇప్పడు మళ్లీ ‘కొడకా కోటేశ్వరరావు..’ అదే ట్రెండ్‌ను సృష్టించేలా ఉంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం అజ్ఞాతవాసి. జల్సా, అత్తారింటికి దారేది లాంటి సూపర్ హిట్ సినిమాలు అందించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా కావటంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు.

Comments

comments

Needi Naadi Oke Katha

Trailer

Latest

Song

Coming Soon

నీదీ నాదీ ఒకే కథ MAR 23
MLA MAR 23
రంగస్థలం MAR 30
భరత్ అనే నేను APR 20
కాలా APR 27
నా పేరు సూర్య MAY 4

Now Showing

కిరాక్ పార్టీ MAR 16
ఏ మంత్రం వేసావె MAR 9
మనసుకు నచ్చింది FEB 16
అ! FEB 16
తొలిప్రేమ FEB 10
చలో FEB 2