టాలీవుడ్

పవన్ కొత్త ట్విట్టర్ ఎక్కౌంట్, తొలి ట్వీట్ ఇదే

పవన్‌ కల్యాణ్‌కి ఆల్రెడీ ఓ అధికారిక ట్విటర్‌ ఎక్కౌంట్ ఉన్న విషయం తెలిసిందే. దీని ద్వారానే ఆయన తన వ్యక్తిగత, వృతికి సంబంధించిన విషయాల గురించి ట్వీట్లు పెడుతూ వస్తున్నారు. అయితే ఇప్పుడు కేవలం తన సినిమాల కోసమే ఆయన ఓ కొత్త ట్విటర్‌ ఖాతాను తెరిచారు.
ఈ విషయాన్ని పవన్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

‘ఈ మాధ్యమం ద్వారా సమాజానికి సేవ చేసేలా మీ ప్రేమాభిమానాలు ఇచ్చిన చిత్ర పరిశ్రమను ఎంతగానో గౌరవిస్తున్నాను. @pkcreativeworksఇది కేవలం సినిమా కోసం తెరిచిన నా కొత్త ట్విటర్‌ ఖాతా’ అనిపవన్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. ఇక ఆయన తన కొత్త ట్విట్టర్ ఎక్కౌంట్ లో చేసిన తొలి ట్వీట్ ఇదే..

ప్రస్తుతం పవన్‌.. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో పవన్‌కి జోడీగా అను ఇమ్మాన్యుయేల్‌, కీర్తి సురేశ్‌ నటిస్తున్నారు. ఈ చిత్రానికి ‘అజ్ఞాతవాసి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. 2018 జనవరిలో ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Comments

comments

Teaser

Trailer

song

Coming Soon

Now Showing

లండన్ బాబులు 17 NOV 17
ఒక్కడు మిగిలాడు NOV 10
C/O సూర్య NOV 10
నెక్స్ట్ నువ్వే NOV 03
PSV గరుడ వేగ NOV 03

Poll