టాలీవుడ్

‘కొడకా కోటేశ్వరావా’అనబోతున్న పవన్..

Pawan-Kalyan-Katamarayudu-Movie-Stills-31పవన్ కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా గురించి రోజుకో ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది. తాజాగా వస్తున్న హాట్ న్యూస్ ఏమిటంటే…ఈ చిత్రంలో కూడా పవన్ కల్యాణ్ ఓ సాంగ్ పాడుతున్నారు. ‘కాటమరాయుడా..’ అంటూ దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో పాడిన పవన్.. ఇప్పడు కూడా అదే టైప్‌లో ఓ జానపద గీతం పాడబోతున్నారట.

యువ స్వర సంచలనం అనిరుధ్ సంగీత సారథ్యంలో పవన్ పాడబోతున్న ఈ పాట ‘కొడకా కోటేశ్వరావా’ అంటూ సాగుతుందిట. శ్రీకాకుళం స్లాంగ్ లో సాగే ఈ పాట ఈ చిత్ర ఆల్బమ్‌కే హైలైట్ అనే వార్తలు ఇప్పుడు అంతటా వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ యమా హ్యాపీగా ఫీలవడమే కాకుండా, ఎప్పడెప్పుడు ఈ సాంగ్‌ని రికార్డ్ చేస్తారా, ఎప్పుడు ఈ సాంగ్ బయటికి వస్తుందా అని ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తారు. డిసెంబర్‌లో ఆడియో విడుదల జరుపుకోనున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

మరో ప్రక్క చిత్రానికి ‘అజ్ఞాతవాసి’ అనే టైటిల్‌ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దాన్నే వర్కింగ్‌ టైటిల్‌గా కూడా కొనసాగిస్తున్నారు. కానీ దీనిపై ఇప్పటి వరకూ చిత్ర యూనిట్ స్పష్టత ఇవ్వలేదు. ఈ చిత్ర యూనిట్ ఇటీవలే యూరప్‌ వెళ్లి వచ్చింది. ఈనెల 27వ తేదీ నుంచి చివరి షెడ్యూల్‌ పనులు మొదలు కానున్నాయి. ఈ షెడ్యూల్‌ వారణాసిలో ప్లాన్‌ చేశారు. అక్కడే టాకీ పార్టు పూర్తి చేసి టైటిల్‌ను ప్రకటించనున్నారు. ఇప్పటి వరకూ సినిమా ఫస్ట్‌లుక్‌ కూడా విడుదల చేయలేదు. అదీ అక్కడ నుంచే విడుదల చేసే అవకాశం ఉందని సినీ వర్గాల సమాచారం.

Comments

comments

Teaser

Trailer

song

Coming Soon

Now Showing

లండన్ బాబులు 17 NOV 17
ఒక్కడు మిగిలాడు NOV 10
C/O సూర్య NOV 10
నెక్స్ట్ నువ్వే NOV 03
PSV గరుడ వేగ NOV 03

Poll