టాలీవుడ్

పవన్ కు మళ్లీ మళ్లీ చూడాలనిపించిన టీజర్ మీరు చూసారా?

సునీల్‌ హీరోగా నటించిన చిత్రం‘2 కంట్రీస్‌’ . శంకర్‌ దర్శకత్వం వహించారు. మనీషా రాజ్‌ హీరోయిన్. మహాలక్ష్మి ఆర్ట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రం టీజర్‌ను పవన్‌ విడుదల చేశారు. ‘2 కంట్రీస్‌’ చిత్రం టీజర్‌ను తన చేతుల మీదుగా విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందని పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ అన్నారు.pawan

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా టీజర్‌ చాలా ఆసక్తికరంగా ఉంది. టీజర్‌లాగానే సినిమా ఉంటుందని ఆశిస్తూ చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా మంచి విజయం సాధించాలి. నేను ఆదరించినట్టే ప్రేక్షకులందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను.. జై హింద్‌’ అని అన్నారు.

అనంతరం సునీల్‌ మాట్లాడుతూ.. ‘పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ నా సినిమా టీజర్‌ను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. విడుదల చేయడమే కాకుండా.. ఎంతో బాగుందని ప్రశంసించిన ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాను’ అని చెప్పారు.pawa2

పవన్‌ షూటింగ్‌లతో బిజీగా ఉన్నప్పటికీ తన విలువైన సమయాన్ని కేటాయించి మరోసారి సహృదయతను చాటుకున్నారని దర్శకుడు శంకర్‌ అన్నారు. పవన్‌కు ధన్యవాదాలు చెప్పారు. డిసెంబరులో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.

ఇక ఈ టీజ‌ర్లో కాస్త బొద్దుగా క‌నిపిస్తున్నాడు సునీల్. ఓ వైపు హీరోగా న‌టిస్తూనే.. మ‌రోవైపు క‌మెడియ‌న్ గా రావ‌డానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు సునీల్. టీజ‌ర్ ఎప్ప‌ట్లాగే రొటీన్ కామెడీతోనే నిండిపోయింది.

Comments

comments

Teaser

Trailer

song

Coming Soon

Now Showing

లండన్ బాబులు 17 NOV 17
ఒక్కడు మిగిలాడు NOV 10
C/O సూర్య NOV 10
నెక్స్ట్ నువ్వే NOV 03
PSV గరుడ వేగ NOV 03

Poll