టాలీవుడ్

సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పవన్‌ టాపిక్కే

pawan1జనసేన పార్టీ అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్‌కల్యాణ్‌ ‘గ్లోబల్‌ ఎక్సలెన్స్‌ అవార్డు’ను అందుకున్నారు. ఇండియా, యూరోపియన్‌ బిజినెస్‌ ఫోరం (ఇ.ఇ.బి.ఎఫ్‌) ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేసింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మన తెలుగు వాళ్లంతా అందుకు సంభందించిన ఫొటోలే షేర్ చేస్తున్నారు. ఇదే టాపిక్ ని మాట్లాడుకోవటం విశేషం. కేవలం పవన్ అభిమానులు మాత్రమే కాక మిగతావారు కూడా ఈ విషయంలో ఆయన్ని అభినందనలు తెలియచేస్తున్నారు.

ఇక శుక్రవారం లండన్‌లో ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో పవన్‌ పాల్గొన్నారు. వెస్ట్‌ మినిస్టర్‌ పోర్టుక్యూలిస్‌ హౌస్‌ ఆఫ్‌ పార్లమెంట్‌, బ్రిటన్‌ పార్లమెంట్‌ హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌లో జరిగిన సభల్లో పాలుపంచుకున్నారు. అవార్డు తీసుకోవడానికి ముందు పవన్‌ లండన్‌లోని బీఆర్‌ అంబేడ్కర్‌ మెమోరియల్‌ను సందర్శించారు.

పవన్‌ శనివారం యూరప్‌లోని వివిధ యూనివర్శిటీలకు చెందిన విద్యార్థులతో సమావేశం కానున్నారు. ఈ కార్యక్రమం వెస్ట్‌ మినిస్టర్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్‌లోని కింగ్స్‌ మెడికల్‌ కళాశాలలో జరగనుంది. ఈ కార్యక్రమంతో పవన్‌ రెండు రోజుల లండన్‌ పర్యటన ముగుస్తుంది.

కాగా పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇందులో పవన్ ఐటీ నిపుణుడిగా కనిపించనున్నాడు. కీర్తి సురేశ్‌, అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్స్ . హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ సంస్థ చిత్రాన్ని నిర్మిస్తోంది. అనిరుధ్‌ బాణీలు అందిస్తున్నారు. పవన్‌ 25వ ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి ‘అజ్ఞాతవాసి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు.

Comments

comments

Teaser

Trailer

song

Coming Soon

లండన్ బాబులు 17

Now Showing

ఒక్కడు మిగిలాడు NOV 10
C/O సూర్య NOV 10
నెక్స్ట్ నువ్వే NOV 03
PSV గరుడ వేగ NOV 03

Poll