టాలీవుడ్

‘కొడకా కోటేశ్వరావా’ అనేసిన పవన్..సాక్ష్యం ఇదిగో

pawaపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం అజ్ఞాతవాసి. జల్సా, అత్తారింటికి దారేది లాంటి సూపర్ హిట్ సినిమాలు అందించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా కావటంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ యూట్యూబ్ లో సరికొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేసింది. తొలిసారిగా అనిరుధ్ స్వరాలందించిన ఆడియోను ఇటీవల అభిమానుల సమక్షంలో ఘనంగా విడువల చేశారు.

ఇక అజ్ఞాతవాసి సినిమా లో పవన్ కల్యాణ్ ఓ సాంగ్ పాడుతున్న సంగతి తెలిసిందే. ‘కాటమరాయుడా..’ అంటూ దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో పాడిన పవన్.. ఇప్పడు కూడా అదే టైప్‌లో ఓ జానపద గీతం పాడారు.

యువ స్వర సంచలనం అనిరుధ్ సంగీత సారథ్యంలో పవన్ పాడబోతున్న ఈ పాట ‘కొడకా కోటేశ్వరావా’ అంటూ సాగుతుంది. ఈ పాటకు సంభందించిన రికార్డింగ్ పూర్తైంది. భాస్కరభట్ల రవికుమార్ రాసిన ఈ పాట…శ్రీకాకుళం స్లాంగ్ లో సాగుతూ…ఈ చిత్ర ఆల్బమ్‌కే హైలైట్ అనే వార్తలు ఇప్పుడు అంతటా వినిపిస్తున్నాయి. దాంతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ యమా హ్యాపీగా ఫీలవడమే కాకుండా, ఎప్పడెప్పుడు ఈ సాంగ్ బయటికి వస్తుందా అని ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గా ఆడియో విడుదల జరుపుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

Comments

comments

Trending

Latest

Song

Coming Soon

MCA DEC 21
హలో DEC 22
ఒక్క క్షణం DEC 28
అజ్ఞాతవాసి JAN 10
జై సింహ JAN 12
చలో FAB 2
తొలిప్రేమ FAB 9

Now Showing

మళ్ళీ రావా DEC 8
జవాన్ DEC 1
ఆక్సిజన్ NOV 30
బాలకృష్ణుడు NOV 24
mental మదిలో NOV 24
ఖాకి NOV 17

Poll