టాలీవుడ్

పవన్ ఫ్యాన్స్ వీడియో చూస్తూంటే కలవరంగా ఉంది

శివబాలాజీ తన సొంత ప్రొడక్షన్లో ‘స్నేహమేరా జీవితం’ అనే సినిమాను నిర్మించాడు. ఆ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ వారం విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో శివబాలాజీ.. రాజీవ్ కనకాల హీరోలుగా నటించారు.

ఇక అసలు విషయంలోకి వస్తే .శివబాలాజీని పవన్‌ తన తమ్ముడిలా భావిస్తారు పవన్ ఫ్యాన్స్ . దీంతో పవన్ తమ్ముడిగా శివకు కూడా అభిమానులు మద్దతు ఇస్తున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఈ సినిమా విజయవంతం కావాలని కోరుతూ.. సినిమా పోస్టర్‌కి హారతులిచ్చారు. ఈ వీడియోను చూసిన శివబాలాజీ ఆనందంతో పొంగిపోయారు.

ఈ వీడియోను జత చేస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘‘ఈ వీడియో చూసి ఇంత ప్రేమకు నేను అర్హుడినా అని కళ్ళు చెమర్చాయి. మనసు కలవరంగా ఉంది. నేను చేసుకున్న ఎన్నో జన్మల పుణ్యఫలం మీ ఈ ప్రేమ.. ఏం చేసి, ఏం ఇచ్చి ఇంత ప్రేమను తిరిగివ్వగలనో అర్థం కావట్లేదు. మీకు సదా రుణపడి ఉంటాను. ఇంతగా అభిమానిస్తున్న మీలో ప్రతి ఒక్కరికీ వేల కోట్ల వందనాలు.. కృతజ్ఞతలు’’ అంటూ శివబాలాజీ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు.

మరోవైపు నవదీప్ కు ప్రస్తుతం సినిమా అవకాశాలు ఏమీ లేవు. అతను ‘మన ముగ్గురి లవ్ స్టోరీ’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు ప్రస్తుతం.

Comments

comments

Teaser

Trailer

song

Coming Soon

లండన్ బాబులు 17

Now Showing

ఒక్కడు మిగిలాడు NOV 10
C/O సూర్య NOV 10
నెక్స్ట్ నువ్వే NOV 03
PSV గరుడ వేగ NOV 03

Poll