టాలీవుడ్

‘అజ్ఞాతవాసి’ ఫస్ట్ లుక్ వచ్చేసింది చూసారా?

pawan kalyanత్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ తన 25వ చిత్రంగా నటిస్తున్న సినిమా టైటిల్ ను, ఫస్ట్ లుక్ ను ఈ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారని వెయ్యి కళ్లతో ఆశగా ఎదురు చూసిన సంగతి తెలిసిందే. అయితే కొద్దిగా లేటైనా ..ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు. ఇక్కడ మీరు ఆ ఫస్ట్ లుక్ ని చూడవచ్చు.

ఈ చిత్రం టైటిల్ ను పరిచయం చేసేందుకు పవన్, కొత్త ట్విట్టర్ ఖాతాను కూడా ప్రారంభించగా, కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా టైటిల్ ఇంకా విడుదల కాలేదని చిత్ర నిర్మాణ సంస్థ హాసినీ క్రియేషన్స్ వెల్లడించింది. టైటిల్ ను మరికొన్ని గంటల్లో విడుదల చేస్తామని చెప్పింది. కాగా, ఈ చిత్రం సంక్రాంతి సీజన్ లో విడుదల కానుందన్న సంగతి తెలిసిందే.

ఇక జ‌ల్సా, అత్తారింటికి దారేది చిత్రాల త‌ర్వాత పవ‌న్ క‌ళ్యాణ్‌- త్రివిక్ర‌మ్ కాంబోలో ఈ మూవీ రూపొందుతుంది. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్ గా న‌టిస్తున్నారు. తమిళ సంగీత దర్శకుడు అనిరుద్ రవి చంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ సినిమాలో పవన్ సరసన నటిస్తున్న హీరోయిన్లలో స్టార్ నటి కీర్తి సురేష్ కూడా ఒకరు. తెలుగులో ఈమె చేస్తున్న మొదటి భారీ ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం. అందుకే ఆమె ఈ సినిమా కోసం స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటున్నారు.

ఇప్పటికే డబ్బింగ్ మొదలుపట్టేశారామె. ఇకపోతే ఈ చిత్రం యొక్క టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రేపు ఉదయం విడుదలకానున్నాయి. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే నెలలో ఈ చిత్రం ఆడియో విడుదల జరుపుకుని 2018 జనవరి 10న సినిమా రిలీజ్ కానుంది.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

రంగస్థలం MAR 30
భరత్ అనే నేను APR 20
కాలా APR 27
నా పేరు సూర్య MAY 4

Now Showing

కిరాక్ పార్టీ MAR 16
ఏ మంత్రం వేసావె MAR 9
మనసుకు నచ్చింది FEB 16
అ! FEB 16
తొలిప్రేమ FEB 10
చలో FEB 2