కోలీవుడ్

మాజీ హీరోయిన్ కూతురు పెళ్లి, ఇండస్ట్రీ మొత్తం వచ్చేసింది

ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు పార్తీపన్, నటి సీత ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి కీర్తన, అభినయ ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొంత కాలం తరువాత మనస్పర్థల కారణంగా పార్తీపన్, సీత విడాకులు పొందారు. పెద్దకుమార్తె కీర్తన తండ్రి పార్తీపన్‌ వద్ద, చిన్న కుమార్తె అభియన తల్లి సీత వద్ద పెరుగుతున్నారు. కాగా పార్తీపన్‌ మరో ఆడపిల్లను దత్తత తీసుకున్నారు. ఈ విషయం అటుంచితే మార్చి 8న కీర్తన పెళ్లి ఘనంగా జరగింది.

ప్రముఖ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ కుమారుడైన అక్షయ్‌తో గురువారం ఉదయం స్థానిక రాజా అన్నామలైపురంలోని ఒక నక్షత్ర హోటల్‌లో ఘనంగా జరిగింది. కీర్తన మణిరత్నం దర్శకత్వం వహించిన కన్నత్తిల్‌ ముత్తమిట్లాల్‌ చిత్రంలో బాల నటిగా నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మణిరత్నం వద్ద సహాయ దర్శకురాలిగా పని చేస్తున్న కీర్తన త్వరలో మెగాఫోన్‌ పట్టనున్నారు. అక్షయ్, కీర్తన ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

వీరి ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు పచ్చజెండా ఊపడంతో ఇటీవలే వివాహ నిశ్చితార్థం నిరాడంబరంగా జరిగింది. గురువారం అక్షయ్, కీర్తనల పెళ్లికి ఈ శుభం కార్డు పడింది. వీరి వివాహ వేడుకను పార్థిబన్, సీత కలిసి ఘనంగా నిర్వహించారు. పార్థిబన్, సీత మనస్పర్థల కారణంగా చాలా కాలం క్రితమే విడిపోయిన విషయం తెలిసిందే. అయితే కూతురి పెళ్లి పార్థిబన్, సీతల సమక్షంలో ఒక వేడుకలా జరగడం విశేషం.

అక్షయ్, కీర్తన వివాహవేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్, దయానిధిమారన్, ఎండీఎంకే నేత వైగోలతో పాటు మక్కల్‌ నీది మయ్యం నేత కమలహాసన్‌ వంటి పలువురు రాజకీయనేతలతో పాటు నటుడు రజనీకాంత్, లతారజనీకాంత్, శివకుమార్, సూర్య, విశాల్, అరుణ్‌విజయ్, విజయ్‌కుమార్, నటి జ్యోతిక, మీనా, శ్రీప్రియ, లక్ష్మి, కుష్బూ, సందర్‌.సీ సత్యరాజ్, జయంరవి, ప్రభుదేవా, జీవీ.ప్రకాశ్‌కుమార్, విజయ్‌సేతుపతి, ఉదయనిధిస్టాలిన్, దర్శకుడు మణిరత్నం, నటి సుహాసిని మణిరత్నం, రోహిణి, రాధిక శరత్‌కుమార్, నిర్మాత ఆర్‌బీ.చౌదరి. ఇళయరాజా, ఏఆర్‌.రెహ్మాన్, గాయకుడు ఎస్‌పీ.బాలసుబ్రహ్మణ్యం, సంగీతదర్శకుడు హరీష్‌జయరాజ్, కే.భాగ్యరాజ్,శంకర్, సినీ ప్రముఖులు హాజరై నవ వధూవరులను ఆశీర్వదించారు.

Comments

comments

Teaser

Latest

Song

Coming Soon

ఏ మంత్రం వేసావె MAR 9
కిరాక్ పార్టీ MAR 16
రంగస్థలం MAR 30
భరత్ అనే నేను APR 20
కాలా APR 27
నా పేరు సూర్య MAY 4

Now Showing

మనసుకు నచ్చింది FEB 16
అ! FEB 16
తొలిప్రేమ FEB 10
చలో FEB 2