హాలీవుడ్

ఒంటిరిగా హోటల్ రూమ్ కు నిర్మాత రమ్మన్నప్పుడే…

Pamela-Anderson‘నా స్నేహితురాలి బోయ్‌ఫ్రెండ్ ఇంటికి వెళ్లగా అతని అన్నయ్య ఆ సమయంలో అక్కడే ఉన్నాడు. అదను చూసి అతను నా మీద అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఓ సందర్భంలో కొంతమంది నాపై సామూహిక అత్యాచారం జరిపారంటూ’ గతంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను రీసెంట్ గా హాలీవుడ్ నటి పమేలా అండర్‌సన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ లైంగిక వేధింపులకు ..నటీమణుల తెలివి తక్కువ తనం కూడా కారణమంటూ కామెంట్ చేయటం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా నిలిచింది.

లైంగిక వేధింపుల వివాదాల్లో ఇరుక్కున్న ప్రముఖ హాలీవుడ్‌ నిర్మాత హార్వే వీన్‌స్టీన్‌ను తప్పుపట్టని ఈమె, తెలివి తక్కువగా ప్రవర్తించడంతోనే నటీమణులపై వేధింపులు జరిగాయని పమేలా అభిప్రాయపడ్డారు. హోటల్ గదులకు ఒంటరిగా వెళ్తే ఏం జరుగుతుందన్న కనీస జ్ఞానం వారికి లేదా అని ప్రశ్నించారు. ఈ విషయంపై ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా నటి పమేలా అండర్‌సన్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.

పమేలా మాట్లాడుతూ.. ‘బాధిత నటీమణులు కొద్దిగా కామన్ సెన్స్ వాడి ఉంటే వేధింపుల భారిన పడకుండా సులువుగా తప్పించుకునేవారని, కానీ వారు ఆ పని చేయలేదు. హాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన సమయంలో తనతో కొందరు అసభ్యంగా ప్రవర్తించాలని చూడగా.. కామన్ సెన్స్ వాడి వేధింపుల నుంచి తప్పించుకున్నాను. ఎవరైనా తనను ఒంటరిగా హోటల్‌ గదికి రమ్మని పిలిస్తే లౌక్యంగా ఆలోచించి అక్కడికి ఒంటరిగా వెళ్లకపోవడమే మంచిది. ఒకవేళ కచ్చితంగా హీరోయిన్లు ఆ హోటళ్లకు వెళ్లాల్సి వస్తే మరో వ్యక్తిని తనకు తోడుగా తీసుకెళ్తే ఏ సమస్యలు తలెత్తేవి కావని’ పేర్కొన్నారు.

నిర్మాత హర్వే వీన్‌స్టీన్ తమను గతంలో లైంగికంగా వేధించాడంటూ ఇటీవల కొందరు ఇండస్ట్రీకి చెందిన దాదాపు 50 మంది మహిళలు ఆరోపించిన విషయం తెలిసిందే. లైంగిక వేధింపుల ఆరోపణల్లో ఇరుక్కున్న నిర్మాత హార్వే వీన్‌స్టీన్‌పై అమెరికా నిర్మాతల గిల్డ్‌ (పీజీఏ) ఇటీవల జీవిత కాల నిషేధం విధించింది.

Comments

comments

Teaser

Latest

Song

Coming Soon

జవాన్ DEC 1
MCA DEC 21
హలో DEC 22
చలో DEC 29

Now Showing

ఆక్సిజన్ NOV 30
బాలకృష్ణుడు NOV 24
mental మదిలో NOV 24
ఖాకి NOV 17
లండన్ బాబులు 17 NOV 17
గృహం NOV 10
ఒక్కడు మిగిలాడు NOV 10
C/O సూర్య NOV 10
నెక్స్ట్ నువ్వే NOV 03
PSV గరుడ వేగ NOV 03

Poll