టాలీవుడ్

“పైసా వసూల్” కథ, హైలెట్స్, మైనస్ లు

balayya“పైసా వసూల్” ట్రైలర్ లో చూపించిన డైలాగులు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీనితో చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. నేడు పైసా వసూల్ చిత్రం ప్రేక్షకుల ముందుకు . ఇప్పటికే వస్తోంది. ఇప్పటికే చాలా చోట్ల ప్రీమియల్ షోలు ప్రదర్శింప బడ్డాయి. అభిమానులైతే “తేడాసింగ్” పాత్రలో బాలయ్యను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఉన్నారు.”గౌతమీ పుత్ర శాతకర్ణి” తో హిట్ కొట్టి బాలయ్య మంచి ఊపులో ఉంటే,వరుస ఫ్లాపులతో పూరి జగన్నాధ్ పూర్తిగా వెనుకబడి ఉన్నాడు.ఈ నేపధ్యంలో “పైసా వసూల్” తో బాలయ్య సక్సెస్ ట్రాక్ కొనసాగిందా లేక పూరి ఫ్లాపుల మరొకటి కలిసిందా అనే విషయం ఉత్కంఠగా మారింది.

బాలా యాక్షన్ అంటూ పూరి పిలుస్తూండగా మొదలైన ఈ చిత్రంలో బాలయ్య ఎంట్రీ పైసా వసూల్ టైటిల్ సాంగ్ తో మొదలవుతుంది. తేడా సింగ్ గా బాలయ్య ఎంట్రీ ఇచ్చాడు. చాలా తేడా తేడాగా బిహేవ్ చేస్తూ అందరి దృష్టిలో పడుతూంటాడు. ఎంతటివారితో అయినా తలపడుతూంటాడు. మరో ప్రక్క ఇంటిలిజెన్స్ డిపార్టమెంట్ …బాబ్ మార్లో అనే ఇంటర్నేషనల్ మాఫియా డాన్ ని పట్టుకోవటం కోసం సరైన వ్యక్తి కావాలని వెతుకుతూంటుంది. ఆ సమయంలో మన తేడా సింగ్ వాళ్ల దృష్టిలో పడతాడు. దాంతో ఇంటలిజెన్స్ డిపార్టమెంట్ బాలయ్య ని ఒప్పించి ఆ టాస్క్ ఇస్తుంది. అక్కడ నుంచి ఆ డాన్ ని పట్టుకోవటానికి బాలయ్య ఏం చేసాడనదే కథ. అసలు ఇంతకీ ఎవరీ తేడా సింగ్ అంటే ఫైనల్ గా పోకిరి లాంటి ట్విస్ట్ తో అతనో రా ఏజెంట్ అని తేలుతుంది.

సినిమా ఫస్టాఫ్ జస్ట్ ఓకే అన్నట్లుగా ఉంది. అక్కడక్కడా తేడా సింగ్ క్యారక్టైరేజేషన్ తో బాలయ్య నవ్వించాడు. ముఖ్యంగా బ్లర్ విజువల్ తో తాగి బాలయ్య ఫైట్ చేసే సన్నివేశం బాగుంది. ఇంటర్వెల్ లోనే క్లైమాక్స్ ట్విస్ట్ ఊహించేయవచ్చు. అలీ కామెడీ పేలలేదు.

చెప్పుకోవటానికి కథగా ఏమీ లేదు…ఫస్టాఫ్ రెండు సాంగ్స్, రెండు సీన్స్ సూపర్ గా ఉన్నాయి. సెకండాఫ్ లో పోర్చుగల్ లో తీసిన సీన్స బాగున్నాయి. ముఖ్యంగా శ్రియను సేవ్ చేసే సీన్ కేక, అక్కడ డైలాగ్స్ అదుర్స్ అని చెప్పాలి. ఫైట్ లో బాలయ్య మేనరిజం అదిరింది. సినిమా చివర్లో భారతదేశం గొప్పతనం గురించి బాలయ్య…స్పీచ్ ఇస్తాడు.

ఫైనల్ గా సినిమా ఓకే అనిపిస్తుంది. ట్రైలర్స్, టీజర్స్ లో చూపినంత గొప్పగా అప్ టు ది మార్క్ లేదనిపిస్తుంది.

Comments

comments

Latest

Recent

Songs

Coming Soon

జై లవ కుశ SEP 21
స్పైడర్ SEP 27
లండన్ బాబులు

Now Showing

యుద్ధం శరణం SEP 8
మేడమీదా అబ్బాయి SEP 8
పైసా వసూల్ SEP 1
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18
నేనే రాజు నేనే మంత్రి AUG 11
జయ జానకి నాయక AUG 11

Poll