టాలీవుడ్

‘కంటి చూపు చెబుతోంది…’రీమిక్స్ ఎలా ఉంది?

ఎన్టీఆర్ నటించిన చిత్రం ‘జీవిత చక్రం’. అందులో ‘కంటి చూపు చెబుతోంది… కొంటె నవ్వు చెబుతోంది’ అనే ఓ సూపర్ హిట్ గీతం ఉంది. ఈ పాటలో ఎన్టీఆర్ – వాణిశ్రీ అభినయించారు. సినారె రచించారు. ‘పైసా వసూల్’లో ఇప్పుడు ఈ గీతాన్ని రీమిక్స్ చేశారు. నందమూరి బాలకృష్ణ నటిస్తున్న చిత్రమిది. పూరి జగన్నాథ్ దర్శకుడు. బాలయ్య చిత్రంలో ఎన్టీఆర్ పాటని పూర్తిస్థాయిలో రీమిక్స్ చేయడం ఇదే తొలిసారి.

అలాగే తొలిసారి నాన్న ఎన్టీఆర్‌లా స్టెప్పులు వేయటంతో ఈ పాట ప్రత్యేకంగా ఉండబోతోందనే ప్రచారం జరిగింది. ఇన్నేళ్ల సినీ జీవితంలో ఎప్పుడూ తండ్రిని అనుకరిస్తూ డ్యాన్సులు చేయలేదు. కానీ ‘పైసా వసూల్‌’లో ఎన్టీఆర్‌ని అనుకరిస్తూ చిందులు వేశారు. ఈ సాంగ్ ని రిలీజ్ చేసారు. మీరు ఈ సాంగ్ ని ఇక్కడ చూడవచ్చు.

అయితే ఈ పాట అనుకున్నంత గొప్పగా లేదని, ఇంప్రెస్ చేయలేకపోయిందని అంతటా వినిపిస్తోంది. మీ అభిప్రాయాన్ని క్రింద పంచుకోవచ్చు.

బాలకృష్ణ – ముస్కాన్‌లపై పోర్చుగల్‌లోని ఒబిడోస్‌ అనే గ్రామంలో ఈ పాటని తెరకెక్కించారు. ఈ గ్రామానికి పదహారు వందల ఏళ్లనాటి చరిత్ర ఉందట. ‘‘కొంటె నవ్వు చెబుతోంది అనే గీతమంటే పూరి జగన్నాథ్‌కి చాలా ఇష్టం. ఎన్నో వందలసార్లు ఈ పాట విన్నారు. ఆ ఇష్టంతోనే ‘పైసా వసూల్‌’లో ఈ పాటని రీమిక్స్‌ చేశారు.

ఈ పాటలో బాలకృష్ణ కాస్ట్యూమ్స్‌ కొత్తగా కనిపించనున్నాయి. పాత తరం లుక్‌ కనిపించడం కోసం కాస్ట్యూమ్స్‌లో ప్రత్యేక రంగులు వాడాం’’ అని చిత్ర యూనిట్ చెబుతోంది. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మాత. సెప్టెంబరు 1న విడుదల కానుంది. గురువారం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి.

Comments

comments

Latest

Recent

Songs

Coming Soon

జై లవ కుశ SEP 21
స్పైడర్ SEP 27
లండన్ బాబులు

Now Showing

యుద్ధం శరణం SEP 8
మేడమీదా అబ్బాయి SEP 8
పైసా వసూల్ SEP 1
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18
నేనే రాజు నేనే మంత్రి AUG 11
జయ జానకి నాయక AUG 11

Poll