బాలీవుడ్

నగ్మా జీవితం ఆధారంగానా ..ఈ హాట్ సినిమా

julie 2రాయ్‌ లక్ష్మి లీడ్ రోల్ లో తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం “జూలీ2”. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోందిది. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్ విడుదలయ్యి సినిమా పై మంచి క్రేజ్ క్రియేట్ చేసాయి. మరో ప్రక్క ఈ సినిమా నిమిత్తం చేస్తున్న ప్రమోషన్ కు చెందినవి అన్నీ అసభ్యకరంగా ఉన్నాయంటూ అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ నవేపధ్యంలో సినిమా పంపిణీ దారుడుగా వ్యవహరిస్తున్న పహ్లాజ్ నిహ్లానీ మరో బాంబ్ పేల్చారు. జూలీ 2.. ఓ నటి జీవిత కథ తెలిపిన సంగతి తెలిసిందే. 1990-2000 మధ్య సినీ పరిశ్రమలో రాణించిన ఓ నటి జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించామన్నారు. కానీ, ఆ పేరు బయటపెట్టలేదు.ఆ నటి పేరు చెబితే తమ సినిమా విడుదలకు ఇబ్బందులు తలెత్తవచ్చని అంటున్నాడు.

ఖాన్ త్రయంలో ఒక హీరో సినిమాతో కథానాయికగా అరంగేట్రం చేసి.. ఆ తర్వాత దక్షిణాదిన కథానాయికగా మంచి అవకాశాలు అందుకుని స్టార్ అయ్యాక.. చివరగా భోజ్ పురి సినిమాల్లోనూ ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ కథ ఇదని క్లూ లు ఇచ్చారు. అయితే ఆ క్లూలు చూస్తే…ఆ హీరోయిన్ ఎవరో కాదు.. నగ్మా అనే ప్రచారం జరుగుతోంది.

హీరోయిన్ రాయ్ లక్ష్మీ మాట్లాడుతూ…నేను సినిమాలో నా పాత్రకూ, ఆ నటి కు పోలికలు లేవు అని ఖండించను. పోలికలు చాలా ఉన్నాయి. అయితే కావాలని ఆ పోలికలుతో స్క్రిప్టు తయారు చేసారో లేక కో ఇన్సిడెంట్ గా కలిసాయో మాత్రం తెలియదు అని తెలివిగా దాటేసింది. ఈ విషయం ఎంత వరకు నిజం అనేది తెలియాలంటే జూలీ 2 సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

రంగస్థలం MAR 30
భరత్ అనే నేను APR 20
కాలా APR 27
నా పేరు సూర్య MAY 4

Now Showing

కిరాక్ పార్టీ MAR 16
ఏ మంత్రం వేసావె MAR 9
మనసుకు నచ్చింది FEB 16
అ! FEB 16
తొలిప్రేమ FEB 10
చలో FEB 2