బాలీవుడ్

’పద్మావతి’ ట్రైలర్ కేకే కానీ..ఈ పాయింట్ గమనించారా?

ఇండియా గర్వించతగ్గ దర్శకులలో ఒకరైన సంజయ్ లీలా బన్సాలీ మళ్లీ వచ్చాడు. ఓ దేవ్‌దాస్.. రామ్‌లీలా.. బాజీరావ్.. ఇప్పుడు పద్మావతి అనే స్దాయిలో దుమ్ము రేపాడు. ఇండియన్ సినిమా హిస్టరీలో తనకు మాత్రమే సాధ్యమైన రిచ్‌నెస్‌తో మరోసారి సినీ లవర్స్‌ను మెస్మరైజ్ చేస్తూ ఓ ట్రైలర్ వదిలాడు. దీపికా, రణ్‌వీర్‌సింగ్, షాహిద్ కపూర్‌లతో కూడిన ఈ మూవీ.. ట్రైలర్‌తోనే అంచనాలను పెంచేసింది. మూడు నిమిషాల ఈ ట్రైలర్ సంజయ్ లీలా బన్సాలీ అంటే ఏంటో మరోసారి చెప్పినట్లైంది.

’పద్మావతి’గా దీపికా పదుకోన్‌ నటిస్తుండగా.. ఆమె భర్త, చిత్తోర్‌గఢ్‌ రాజ రతన్‌ సింగ్‌గా షాహిద్‌ కపూర్‌, విలన్‌ సుల్తాన్‌ అల్లావుద్దీ ఖిల్జీగా రణ్‌వీర్‌ సింగ్‌ నటిస్తున్నాడు. ఎంతో ఆసక్తి రేపుతున్న ఈ సినిమా ట్రైలర్‌ సోమవారం మధ్యాహ్నం సరిగ్గా.. 13.03 గంటలకు విడుదల చేశారు

ఈ సందర్బంగా మీకో విషయం గుర్తు చేస్తున్నాం… ఈ సినిమా ట్రైలర్‌ను సరిగ్గా 13.03 గంటలకు విడుదల చేయడం వెనుక ఒక కారణముంది…అది మీరు గుర్తించారో లేదో అని తెలియచేస్తున్నాం. చారిత్రకంగా సరిగ్గా 1303లోనే చిత్తోర్‌గఢ్‌పై అల్లావుద్దీన్‌ ఖిల్జీ దండయాత్ర విజయవంతమైంది. గుహిలాసింగ్‌ రత్నసింహా (లేదా రతన్‌సింగ్‌) ఆధ్వర్యంలో రాజ్‌పుత్‌ సేనతో ఎనిమిది నెలలు యుద్ధంచేసిన ఖిల్జీ.. చివరకు 1303లో ఈ రాజ్యాన్ని తన సామ్రాజ్యంలో కలిపేసుకసున్నాడు. ఆ చారిత్రక ఘట్టానికి గుర్తుగా 13.03 గంటలకు ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

రాజు గారి గది 2 OCT 13
రాజా ది గ్రేట్ OCT 18
ఉన్నది ఒకటే జిందగీ OCT 20
నెక్స్ట్ నువ్వే NOV 03
లండన్ బాబులు

Now Showing

మహానుభావుడు SEP 29
స్పైడర్ SEP 27
జై లవ కుశ SEP 21

Poll