బాలీవుడ్

ఈ హీరో ఫస్ట్ లుక్ ఫొటోలు షాక్ ఇస్తున్నాయి, చూసారా

బాలీవుడ్‌ నటులు దీపిక పదుకొణె, షాహిద్‌ కపూర్‌, రణ్‌వీర్‌ సింగ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పద్మావతి’. ఈ చిత్రానికి సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రంలోని ‘రాణి పద్మావతి’ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. దీనికి కొనసాగింపుగా పద్మావతి భర్త మహారావల్‌ రతన్‌ సింగ్‌ పాత్రను సైతం పరిచయం చేశారు. ఈ పాత్రలో షాహిద్‌ నటిస్తున్నాడు. ఒంటి నిండా గాయాలతో ఉన్నా ధైర్యం నిండిన కళ్లతో ‘రతన్‌ సింగ్‌’ ఆహార్యం ఆకట్టుకుంది. ఇప్పటికే ఈ ఫస్ట్‌లుక్‌ ట్విటర్‌ ట్రెండింగ్‌ టాప్‌లో ఉంది.

ఇప్పుడు మరో పాత్ర ఫస్ట్ లుక్ వచ్చేసింది. అదే అల్లా ఉద్దిన్‌ ఖిల్జి. ఈ పాత్రలో రణ్‌వీర్‌ సింగ్‌ నటిస్తున్నాడు. ఇక ఖిల్జి పాత్రలో రణ్‌వీర్‌ ఎలా ఉండబోతున్నాడోనని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. వారిని ఆనంద పరిచేలా ఈ లుక్ ఉంది.

ఖిల్జి పాత్రలో రణ్‌వీర్‌ సింగ్‌నటిస్తున్నాడు. ఫస్ట్‌లుక్‌లో పొడవాటి జుట్టు, కంటి కింద గాటుతో రణ్‌వీర్‌ ‘ఖిల్జి’ గెటప్‌లో అదరగొట్టేశాడు. ఇప్పటికే ఈ ఫస్ట్‌లుక్‌ ట్విటర్‌లో ట్రెండింగ్‌లో టాప్‌లో ఉంది.

‘పద్మావతి’ సినిమాని రూ.160 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. అయితే మరో 40 కోట్లు అదనంగా ఖర్చు చేయనున్నట్లు బాలీవుడ్‌ వర్గాల సమాచారం. ఇందుకు కారణం ‘బాహుబలి’ బడ్జెటేనట. బాక్సాఫీస్‌ రికార్డులు బద్దలుకొడుతున్న ‘బాహుబలి’ చిత్రాన్ని రూ.450 కోట్లు పెట్టి తీయడంతో అందులో సగం బడ్జెట్‌ పెట్టి ‘పద్మావతి’ తీసి ప్రేక్షకులకు బాహుబలి లాంటి అనుభూతి కలిగించేలా చేయాలన్నది భన్సాలీ ఆలోచన.

అంతేకాదు ఇందులో బ్రిటీష్‌ నటులను కూడా ఎంపికచేసినట్లు తెలుస్తోంది. ఖిల్జీ వంశానికి చెందిన అల్లావుద్దిన్‌ ఖిల్జి, అతని ప్రేమ కథ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఖిల్జి పాత్రలో రణ్‌వీర్‌ సింగ్‌, రాణి పద్మావతిగా దీపిక పదుకొణె, పద్మావతి భర్త పాత్రలో షాహిద్‌ కపూర్‌లు నటిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్‌ 17న విడుదల కాబోతోంది.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

లండన్ బాబులు

Now Showing

మహానుభావుడు SEP 29
స్పైడర్ SEP 27
జై లవ కుశ SEP 21
ARJUN REDDY AUG 25

Poll