బాలీవుడ్

వామ్మో ..అన్ని కట్స్ మేము అసలు చెప్పనే లేదు

 

Padmavati-Movie-Trailerసంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కించిన పద్మావతి సినిమాపై కొన్ని హిందూ సంస్థలు, రాజ్‌పుత్ కులానికి చెందిన కొందరు నిరసనలకు దిగడంతో ఆ సినిమా నిర్మాతలు దాని విడుదలను నిరవధికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు చిత్రం టైటిల్ ని ‘పద్మావత్‌’గా మార్చి సినిమా విడుదల తేదీ ఖరారు చేసారు. ఈ సినిమాను జనవరి 25న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో 300 కట్స్ వేసారని వార్తలు నేషనల్ మీడియాలో మొదలయ్యాయి. దాంతో సీబిఎఫ్ సి చీఫ్ జోషి ఓ ప్రకటన చేసారు.

సినిమాలో ఎలాంటి సన్నివేశాలను తొలగించలేదని కేవలం నాలుగు సవరింపులు మాత్రమే చేశామని జోషి స్పష్టం చేశారు. కానీ సినిమాకు ఏకంగా 300 కత్తెర్లు‌ పడినట్లు వచ్చే వార్తల్లో నిజం లేదన్నారు. సినిమాలో చిత్తోర్‌గఢ్‌, దిల్లీ, మేవార్‌ పదాలకు సంబంధించి అన్ని సన్నివేశాలను తొలగించినట్లు తెలుస్తోంది. అయితే దీని గురించి సీబీఎఫ్‌సీ, చిత్ర యూనిట్ నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది.

రాజ్‌పుత్‌ మహారాణి పద్మని జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. దీపికా పదుకొణె, షాహిద్‌ కపూర్‌, రణ్‌వీర్‌ సింగ్‌ ప్రధాన తారాగణంగా నటించారు. సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వం వహించారు. ఇందులో తమ దేవతలాంటి పద్మిని గురించి తప్పుగా చూపిస్తున్నారని రాజ్‌పుత్‌ కర్ణిసేన కార్యకర్తలు ఆందోళనలు చేశారు. సినిమా విడుదలను వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో సినిమాను దేశవ్యాప్తంగా నిషేధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు. అంతేకాదు భన్సాలీని, దీపికకు చంపుతామని బెదిరించారు. సినిమా సెన్సార్‌ పూర్తైనప్పటికీ ఈ ఆందోళనలు ఆగకపోవడం గమనార్హం.

సినిమాలో రాణి పద్మావతిని తప్పుగా చూపించారని తమ రాజ్‌పుత్‌ల మనోభావాలను దెబ్బతీశారంటూ రాజస్థాన్‌కి చెందిన కర్ణిసేన సంఘాలు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి.

దాంతో సినిమాను నిషేధిస్తూ వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేశాయి. దాంతో భన్సాలీ..సీబీఎఫ్‌సీ చీఫ్‌ ప్రసూన్‌ జోషితో కలిసి పార్లమెంటరీ ప్యానెల్‌తో సమావేశమయ్యారు. అక్కడ చర్చలు విఫలమయ్యాయి. దాంతో రాజస్థాన్‌కి చెందిన కొందరు రాజకుటుంబీకులు, చరిత్రకారులను పిలిపించి వారినే సినిమాను సమీక్షించాల్సిందిగా కోరారు. వారు చెప్పిన కొన్ని తప్పులను సరిచేసి ఆఖరికి ‘పద్మావత్‌’గా సినిమాను ఈ నెల 25న విడుదల చేయనున్నారు.

Comments

comments

Teaser

Latest

Song

Coming Soon

నా పేరు సూర్య MAY 4
కాలా

Now Showing

భరత్ అనే నేను APR 20
కృష్ణార్జున యుద్ధం APR 12
ఛల్ మోహన్ రంగ APR 5
రంగస్థలం MAR 30
నీదీ నాదీ ఒకే కథ MAR 23
MLA MAR 23
కిరాక్ పార్టీ MAR 16