టాలీవుడ్

‘ జై ల‌వ‌కుశ ‘ కథ, హైలెట్స్, మైన స్ లు

jai lava kusa release poster3సీనియర్ ఎన్టీఆర్ (నందమూరి తారక రామారావు) దానవీరశూరకర్ణలో ఒకేసారి అనేక పాత్రల్ని పోషించి రికార్డ్స్ క్రియేట్ చేశారు. ఇప్పుడు ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ వంతు వచ్చింది. ఎన్టీఆర్ తన తాతగారిలా విభిన్నమైన పాత్రల్ని పోషించాలని చాలా కాలంగా కోరుకుంటున్న అభిమానులు కోరిక తీర్చాలని ఫిక్సై ఈ సినిమా చేసినట్లున్నారు. జై లవకుశ లో మూడు పాత్రలు, అందుల్లో ఒకటి విలన్ పాత్ర అని తెలియగానే, ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. సినిమా ట్రైలర్స్ తో అంచనాలు పీక్స్ కు చేరుకున్న నేపథ్యంలో, ఈ సినిమా ఈ రోజు రిలీజైంది. ఈ నేపద్యంలో సినిమా ఎలా ఉంది..? ఎన్టీఆర్ ఏ పాత్రను ఎలా పోషించాడు..? తారక్ ఎకౌంట్ లో ఇంకో హిట్ పడిందా..?

ఇప్పటికే చూసిన వారి నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా పూర్తిగా ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో. హీరోయిజం, ఎంటర్టైన్మెంట్ కలిపి ఎన్టీఆర్ నట విన్యాశాలను దృష్టిలో పెట్టుకుని వండిన కథ ఇది. సినిమాలో ఎన్టీఆర్ స్క్రీన్ టైమ్ ఎయిటీ పర్శంట్ పైగా ఉంది అంటే అతిశయోక్తికాదు. ఎన్టీఆర్ అభిమానులకు ఈ సినిమా పిచ్చ పిచ్చగా నచ్చుతుంది.

ప్లస్ పాయింట్ల కొస్తే ..మొదటి 15 నిముషాలు …బోర్ అనిపించినా , ఒకసారి కథలోకి ప్రవేశించాక ఫన్ మొదలవుతుంది. అక్కడ నుంచి ఎంటర్టైన్మెంట్ తో ముందుకు సాగిపోతుంది. జై పాత్ర సింహాద్రి లో ఎన్టీఆర్ ని గుర్తు చేస్తే , కుశ పాత్ర అదుర్స్ లో చారి ని గుర్తు చేస్తుంది. ముఖ్యంగా బాబి డైలాగులు ఫన్ తో బాగున్నాయి.

నెగిటివ్ పాయింట్స్ ఏమిటంటే…సినిమా ఫస్టాఫ్ వెళ్లినంత స్పీడుగా సెంకండాఫ్ నడవదు. ముగ్గురు కవలలు అనే పాయింట్ ని బేస్ చేసుకుని ట్రీట్ మెంట్ చేసారు. క్లైమాక్స్ పార్ట్ అయితే పూర్తి ఎమోషనల్ తో కూడి సెంటిమెంట్ డ్రామా పండుతుంది. రెండు పాటలు స్క్రీన్ పై బాగున్నాయి. మిగతా పాటలు ఓకే. సాంగ్స్ కోసం వచ్చే రిపీట్ ఆడియన్స్ పై ఇది ఇంపాక్ట్ చూపుతుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల దుమ్మురేపింది. కొన్ని చోట్లడల్ అయ్యింది.

ఇక ఇ సినిమా కథేంటంటే..

కవల సోదరులైన …జై, లవ, కుశ ( ఎన్టీఆర్‌లు) లలో జైకి నత్తి. సరిగా మాట్లాడలేడు. అందుకే మిగిలిన ఇద్దరు సోదరులతో కలవలేడు. దానికి తోడు లవ, కుశ కూడా జైని చిన్న చూపు చూస్తారు. దాంతో చిన్నప్పుడే తన సోదరులపై కోపం పెంచుకొంటాడు జై. ఇక కథానుసారం ప్రమదవశాత్తూ అన్నదమ్ములు ముగ్గురూ… చిన్నప్పుడే తప్పిపోయి విడిపోతారు.

ఆ తర్వాత కాలంలో లవ కుమార్‌ పెరిగి పెద్దవాడై బ్యాంకు ఉద్యోగిగా స్థిరపడతాడు. కుశ ఏదోలా మాయ చేసి, అమెరికా వెళ్లి, గ్రీన్‌ కార్డ్‌ సంపాదించి అక్కడే సెటిలవ్వాలని కలగంటాడు. వీరిద్దరి జీవితాల్లోకి ‘జై’ ప్రవేశిస్తాడు. చిన్నప్పటి పగనీ, ప్రతీకారాన్నీ ఎలా తీర్చుకొన్నాడు? తన ఎదుగుదలకు వీళ్లని ఎలా వాడుకొన్నాడు? ఈ ముగ్గురూ కలిశారా? కలిసుంటూనే ఒకరిపై మరొకరు పోరాటం చేశారా? చివరికు ఏం జరిగిందన్నదే మిగిలిన కథ.

ఫైనల్ గా ఈ కథని ఎన్టీఆర్ కాకపోతే మరొకరుతో తీయలేరనేది మాత్రం నిజం. అలాగే తమిళ చిత్రం ‘వరలరు’ చిత్రానికి సంభందం లేదు. కాపీ అసలే కాదు. ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఫ్యామిలీలు హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయచ్చు.

Comments

comments

Latest

Promo

song

Coming Soon

జై లవ కుశ SEP 21
స్పైడర్ SEP 27
మహానుభావుడు SEP 29
లండన్ బాబులు

Now Showing

కథలో రాజకుమారి SEP 15
ఉంగరాల రాంబాబు SEP 15
శ్రీవల్లీ SEP 15
యుద్ధం శరణం SEP 8
మేడమీదా అబ్బాయి SEP 8
పైసా వసూల్ SEP 1
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18
నేనే రాజు నేనే మంత్రి AUG 11
జయ జానకి నాయక AUG 11

Poll