గాసిప్స్

మిలటరీ ఆపరేటివ్ ఆఫీస్ గా ఎన్టీఆర్

Jr-NTR-Jai-Lava-Kusa-Telugu-Movie-Stills-12జైలవకుశ హిట్ ఊపులో ఉన్న యంగ్ టైగర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయటానికి సిద్దపడుతున్నారు. ఈ విషయాన్ని జై లవకుశ చిత్రం ప్రమోషన్ కార్యక్రమంలో ఎన్టీఆర్ వెల్లడించిన సంగతి తెలిసిందే. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ లాంటి చిత్రాల్లో విభిన్నమైన పాత్రల్లో కనిపించాడు ఎన్టీఆర్. త్వరలో విడుదల కాబోతున్న జై లవ కుశలో రావణ పాత్రతో ఓ ప్రయోగానికి తెరలేపాడు. తన తదుపరి చిత్రంలో నటుడిగా మారో ప్రయోగానికి శ్రీకారం చుట్టునున్నట్టు సమాచారం.

అందుతున్న సమాచారం ప్రకారం త్రివిక్రమ్ తో చేయబోయే చిత్రంలో ఎన్టీఆర్ మలిటరీ ఆపరేటివ్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. త్రివిక్రమ్ స్టైల్ లో నడిచే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ అని , ఎన్టీఆర్ కి తగ్గ మాస్ ఎలిమెంట్స్ సైతం సినిమాలో ఉంటాయని చెప్తున్నారు.

త్రివిక్రమ్-ఎన్టీఆర్ సినిమాకి సంబంధించి పూర్తి స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయిందని తెలుస్తుండగా, ఇందులో ఎన్టీఆర్ ని త్రివిక్రమ్ డిఫరెంట్ గా చూపించాలని భావిస్తున్నాడట. అందుకోసం బరువు తగ్గాలనీ .. మరింత ఫిట్ గా కనిపించాలని సూచించాడట. దాంతో డైట్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, నిపుణుల పర్యవేక్షణలో జిమ్ లోనే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నాడట ఎన్టీఆర్ .

థాయ్ ల్యాండ్ .. ఇండోనేషియా స్టైల్ మార్షల్ ఆర్ట్స్ ను తెరపై చూపించాల‌ని త్రివిక్ర‌మ్ భావిస్తుండ‌గా, ఈ మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందడానికి ఎన్టీఆర్ ఆగ్నేయ ఆసియా వెళ్లనున్నట్టు సమాచారం. త్రివిక్రమ్ ప్రస్తుతం పవన్ సినిమాతో బిజీగా ఉండగా, ఈ మూవీ పూర్తైన వెంటనే ఎన్టీఆర్ సినిమాని సెట్స్ పైకి తీసుకెళతాడట.

Comments

comments

Trending

Latest

Trailer

Coming Soon

స్పైడర్ SEP 27
మహానుభావుడు SEP 29
లండన్ బాబులు

Now Showing

జై లవ కుశ SEP 21
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18

Poll