Needi-Naadi-Oke-Katha-baner1
టాలీవుడ్

రామోజీరావుని కలిసి డిస్కస్ చేయనున్న బాలయ్య, తప్పదు కదా మరి

balayya-ramojiతెలుగు రాష్ట్రాల్లో వున్న ప్రముఖ పారిశ్రామికవేత్తల్లో రామోజీరావు ఒకరు. రామోజీ ఫిలిం సిటీ, ఈనాడు పత్రిక, ఈటీవీ ఛానళ్ళు, మార్గదర్శి, ప్రియా ప్రొడక్ట్స్ అంటూ చాలా వ్యాపారాలు చేస్తూ రాష్ట్రంలో అగ్రగామిగా దూసుకుపోతున్నారు ఆయన. అప్పట్లో రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఆయనకు రాజకీయాల్లో ఎటువంటి సందేహం వచ్చినా ఈయన దగ్గరకే వెళ్లేవారని చెప్పుకుంటారు. అయితే ఇప్పుడీ టాపిక్ ఎందుకు అంటారా…అక్కడికే వస్తున్నాం..

దర్శకుడు తేజ దర్శకత్వంలో తెరకెక్కబోయే ‘ఎన్టీఆర్‌’ చిత్రంలో సీనియర్‌ హీరో బాలకృష్ణ లీడ్‌ రోల్‌ పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 29న చిత్రాన్ని లాంఛ్‌ చేయనున్నట్లు ఆయన మీడియాతో ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపధ్యంలో ఎన్టీఆర్ తో ఎన్నో సన్నిహితంగా మెలిగిన రామోజీరావు పాత్ర ఎవరు వేస్తారు..అసలు ఆ పాత్రను ఎలా చూపించనున్నారు అనే విషయమై ఇప్పటికే తర్జన బర్జనలు మొదలయ్యాయి. ఈ విషమయై బాలకృష్ణ స్వయంగా రామోజీరావుతో మాట్లాడి ఫైనల్ చేస్తారని సమాచారం.

ఈ నేపథ్యంలో నేడు కృష్ణా జిల్లా పామర్రు మండలం కోమరవోలు, ఎన్టీఆర్‌ స్వస్థలం నిమ్మకూరు గ్రామాలలో త్వరలో బాలకృష్ణ పర్యటించారు. చిత్ర ముహూర్తానికి రావాలని ఆయా గ్రామల్లో ఉన్న తమ బంధువులను ఆయన ఆహ్వానించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బాలయ్య.. ఎన్టీఆర్‌ తనయుడిగా ఆయన జీవిత చరిత్ర నటించటం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు.

హైదరాబాద్‌ రామకృష్ణ సినీ స్టూడియోలో తొలిషెడ్యూల్‌ షూటింగ్‌ జరగనున్నట్లు తెలియజేశారు. ఎన్టీఆర్‌ వాస్తవ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కబోయే చిత్రమని, ఎన్నికల సందర్భంగా తీసే సినిమా కాదని బాలయ్య స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. సినిమా షూటింగ్‌ను వేగవంతంగా పూర్తి చేసి వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు.

కీరవాణి సంగీతం అందించబోతున్న ఈ సినిమాకు బుర్రా సాయిమాధవ్ మాటలు రాస్తున్నారు. కళ్యాణ్ రామ్ కుమారుడు ఈ సినిమాలో ఎన్టీఆర్ చిన్నప్పటి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలో బాలయ్య 72 విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నాడు. కృష్ణ, నాగేశ్వర రావ్ వంటి నటులతో పాటు సినారె బాపు వంటి రచయితలు ఈ సినిమాలో కనిపించబోతున్నారు. పి.వి. నరసింహరావ్, ఇందిరాగాంధీ పాత్రలు ఈ సినిమాలో కీలకంగా ఉండబోతున్నాయి. వచ్చే ఏడాది జనవరికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.

ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఈరోజు ఆయన అమరావతిలోని సచివాలయానికి వచ్చారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ సినిమా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తీస్తున్నది కాదని స్పష్టం చేశారు. వచ్చే సంక్రాంతికి విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. తెలుగు వారందరూ పార్టీలకు అతీతంగా ఎన్టీఆర్‌ను అభినందించేవారేనని.. ఈ సినిమాకు చాలామంది చాలా పేర్లు సూచించారని తెలిపారు. ఈ నెల 31, ఏప్రిల్‌ 1న లేపాక్షి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు బాలకృష్ణ తెలిపారు. హంద్రీనీవా సుజల స్రవంతికి జలహారతి నిర్వహించి లేపాక్షి ఉత్సవాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

ఇక రీసెంట్ గా బాలకృష్ణకు శస్త్రచికిత్స జరిగిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన కట్టుతోనే ఈరోజు ఆయన అసెంబ్లీకి వచ్చారు. దీంతో పలువురు ఎమ్మెల్యేలు ఆయన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ఎన్నో దెబ్బలతో పోలిస్తే ఇది పెద్ద దెబ్బ కాదని వ్యాఖ్యానించారు.

Comments

comments

Needi Naadi Oke Katha

Trailer

Latest

Song

Coming Soon

నీదీ నాదీ ఒకే కథ MAR 23
MLA MAR 23
రంగస్థలం MAR 30
భరత్ అనే నేను APR 20
కాలా APR 27
నా పేరు సూర్య MAY 4

Now Showing

కిరాక్ పార్టీ MAR 16
ఏ మంత్రం వేసావె MAR 9
మనసుకు నచ్చింది FEB 16
అ! FEB 16
తొలిప్రేమ FEB 10
చలో FEB 2