టాలీవుడ్

‘జై సింహా’తో పాటుగా‘ఎన్టీఆర్‌’…అందుకే ఈ హడావిడి

jai-simhaనందమూరి తారక రామారావు బయోపిక్ గా తెరకెక్కబోతున్న ‘ఎన్టీఆర్‌’కి రంగం సిద్ధమైంది. ఈ రోజు (గురువారం) నుంచే హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో షూటింగ్ మొదలవుతోంది. తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌గా బాలకృష్ణ నటిస్తున్నారు. సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరితో కలిసి బాలకృష్ణ స్వయంగా నిర్మిస్తున్నారు.

ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా జనవరి 18న ‘ఎన్టీఆర్‌’ టీజర్‌ని విడుదల చేయాలని నిర్ణయించింది చిత్రయూనిట్. అందుకే మొదట టీజర్‌ కోసమే షూటింగ్ మొదలు పెడుతున్నారు. రానున్న సంక్రాంతికి ‘జై సింహా’తో సందడి చేయబోతున్నారు బాలకృష్ణ. ‘ఎన్టీఆర్‌’ని కూడా వచ్చే యేడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో రంగంలోకి దిగుతున్నారు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా పై భారి అంచనాలు ఉన్నాయి. బాలకృష్ణ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ బయోపిక్ ను అద్భుతంగా తెరకెక్కిచబోతున్నామని తెలిపారు.

దర్శకుడు తేజ…ఎన్టీఆర్‌ బయోపిక్‌తో పాటు, హీరో వెంకటేష్‌తో ఓ సినిమా చేయనున్నారు. ఈ విషయాన్ని ఫేస్‌బుక్‌ వేదికగా పంచుకున్న ఆయన.. రెండు సినిమాలు త్వరలోనే ప్రారంభమవుతాయని వెల్లడించారు.

Comments

comments

Trending

Latest

Song

Coming Soon

ఒక్క క్షణం DEC 28
అజ్ఞాతవాసి JAN 10
జై సింహ JAN 12
చలో FAB 2
తొలిప్రేమ FAB 9

Now Showing

MCA DEC 21
హలో DEC 22
మళ్ళీ రావా DEC 8
జవాన్ DEC 1

Poll