గాసిప్స్

వెంకి టైటిల్ ని ఎన్టీఆర్ వాడేస్తున్నాడా

ntr venkiపాత సినిమా టైటిల్స్‌ను కొత్త చిత్రం టైటిల్స్‌గా వాడటం .. కొత్త ట్రెండ్. పవన్ కల్యాణ్‌ తొలిసారి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా.. తొలిప్రేమ.. ఈ టైటిల్‌ను వరుణ్ తేజ తన సినిమాకు వాడుకుంటున్నారు.అలాగే … వెంకటేష్ హీరోగా వచ్చిన శ్రీనివాస కల్యాణం మూవీ గుర్తుందా? వెంకటేష్ సరసన భానుప్రియ, గౌతమి నటించారు. కోడి రామకృష్ణ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మళ్లీ ఈ టైటిల్‌తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూవీ చేయనున్నారనే వార్తలు ఫిలింనగర్‌లో షికారు చేస్తున్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే… ఎన్టీఆర్‌ ప్రస్తుతం ‘జై లవకుశ’చిత్రీకరణతో బిజీగా ఉన్నారు. బాబి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా దసరా వేడుక సందర్భంగా సెప్టెంబర్‌ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత తారక్‌.. దిల్‌రాజు కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం.

ఈ సినిమాకు ‘శ్రీనివాస కల్యాణం’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. కుటుంబ విలువలు, భావోద్వేగాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ చిత్రానికి గాను దిల్‌రాజు తారక్‌కు భారీ పారితోషికం ఆఫర్‌ చేసినట్లు టాలీవుడ్‌ టాక్‌. ‘జై లవకుశ’ తర్వాత తారక్‌ త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా పూర్తయ్యాక దిల్‌రాజు చిత్రంలో ఎన్టీఆర్‌ నటించే అవకాశాలు ఉన్నాయి.

Comments

comments

Latest

Recent

Songs

Coming Soon

జై లవ కుశ SEP 21
స్పైడర్ SEP 27
లండన్ బాబులు

Now Showing

యుద్ధం శరణం SEP 8
మేడమీదా అబ్బాయి SEP 8
పైసా వసూల్ SEP 1
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18
నేనే రాజు నేనే మంత్రి AUG 11
జయ జానకి నాయక AUG 11

Poll