టాలీవుడ్

ఎవరి స్కెచ్ వాళ్లది..అటు కమల్, ఇటు విక్రమ్ మధ్యలో నితిన్

Kamal Nithin Vikramచూస్తూంటే నితిన్ చాలా ఇంట్రస్టింగ్ ప్రాజెక్టులు ఓకే చేస్తున్నారు. ముఖ్యంగా తమిళంలోనూ తన మార్కెట్ ని పెంచుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకు అండగా కమల్, విక్రమ్ ల సాయిం తీసుకుంటున్నట్లు సమాచారం. కమల్, విక్రమ్ కలిసి చేస్తున్న ఓ సినిమాలో నితిన్ సైతం ఓ క్యారక్టర్ వేసేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కమల్, విక్రమ్ లు తమ సినిమాకు లోకల్ తెలుగు స్టార్ హీరో నితిన్ లాంటి వాడు తోడైతే ఇక్కడ మార్కెట్ కు కలిసి వస్తుందని, బిజినెస్ పరంగానూ, ఓపినింగ్స్ పరంగానూ ప్లస్ అవుతుందని భావించినట్లు సమాచారం. నితిన్ సైతం..తనకు వీళ్ల సినిమాలో నటించటంతోతమిళంలో ప్లస్ అవుaతుందని ఓకే అన్నట్లుగా చెప్పుకుంటున్నారు.

కమల్ తన సొంత రాజ్‌ కమల్‌ ఇంటర్‌నేషనల్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై విక్రమ్‌ తో కలిసి ఓ సినిమాను నిర్మించేందుకు ప్లాన్‌ చేస్తున్నాడు. రీమేక్‌ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో నితిన్‌ హీరోగా నటించనున్నాడట. ఓ ఫ్రెంచ్‌ సినిమాకు రీమేక్‌ గా తెరకెక్కనున్న ఈ సినిమాకు చీకటిరాజ్యం ఫేం రాజేష్‌ సెల్వ దర్శకత్వం వహించనున్నాడు. ఇప్పటికే రీమేక్‌ రైట్స్ తీసుకున్న చిత్రయూనిట్ ప్రీ ప్రొడక్షన్‌ పనులు ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమాలో విక్రమ్‌ కూడా కీలక పాత్ర పోషించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.

మరో ప్రక్క నితిన్‌, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్న చిత్రం ‘శ్రీనివాస కల్యాణం’. వేగేశ్న సతీశ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. నందిత శ్వేత, ప్రకాశ్‌ రాజ్‌ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జే మేయర్‌ సంగీతం అందిస్తున్నారు. ‘‘ ఈ నెల 16 నుంచి రెగ్యులర్‌ షూట్‌ స్టార్ట్‌ కానుంది. ఈ షెడ్యూల్‌ ఈ నెల 30 వరకు జరుగుతుంది. ఈ ఏడాది జూన్‌ కల్లా షూటింగ్‌ను కంప్లీట్‌ చేసి, జూలై చివరి వారం లేదా ఆగస్టు మొదటి వారంలో చిత్రాన్ని విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది.

మరోపక్క నితిన్‌ ‘ఛల్‌ మోహన్‌ రంగ’ సినిమాతో బిజీగా ఉన్నారు. కృష్ణ చైతన్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, పవన్‌ కల్యాణ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో నితిన్‌కి జోడీగా మేఘా ఆకాశ్‌ నటిస్తున్నారు.

Comments

comments

Teaser

Latest

Song

Coming Soon

ఏ మంత్రం వేసావె MAR 9
కిరాక్ పార్టీ MAR 16
రంగస్థలం MAR 30
భరత్ అనే నేను APR 20
నా పేరు సూర్య MAY 4
కాలా APR

Now Showing

మనసుకు నచ్చింది FEB 16
అ! FEB 16
తొలిప్రేమ FEB 10
చలో FEB 2