టాలీవుడ్

నిఖిల్ ట్వీట్ లో మంచి డెప్త్ ఉంది

వెరైటీ కాన్సెప్ట్ లతో, వైవిధ్యభరిత సినిమాలతో తెలుగు ప్రేక్షకులలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో నిఖిల్ సిద్ధార్థ… విజయదశమి పర్వదినాన వినూత్నంగా సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. ప్రతి ఆడపిల్లలోనూ ఆత్మవిశ్వాసాన్ని నింపేలా తన ఆలోచనలను ట్విటర్ వేదికగా పంచుకున్నారు. దసరా శుభాకాంక్షలు చెబుతూ… అందరూ ప్రార్థించాల్సిన అసలు విషయాలను చెప్పాడు.

‘‘ఈ ఏడాది ఏ దుర్గమ్మకూ గర్భస్రావం కాకూడదు.. ఏ సరస్వతీదేవీ స్కూలుకు వెళ్లేందుకు ఆటంకాలు ఎదుర్కోకూడదు… ఏ లక్ష్మీదేవీ డబ్బు అడుక్కునే పరిస్థితి రాకూడదు… ఏ పార్వతీదేవీ వరకట్నానికి బలికాకూడదు… ఏ కాళీమాతకూ అందం కోసం ఫెయిర్‌నెస్ వినియోగించాల్సిన అవసరం రాకూడదని మనమంతా ప్రార్థన చేద్దాం…’’ అని పేర్కొన్నాడు. సమాజం పట్ల తనదైన బాధ్యతగా నిఖిల్ పంచుకున్న ఈ నాలుగు మాటలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

లండన్ బాబులు

Now Showing

మహానుభావుడు SEP 29
స్పైడర్ SEP 27
జై లవ కుశ SEP 21
ARJUN REDDY AUG 25

Poll