టాలీవుడ్

ఆ నర రాక్షసులను అడ్డుకొని శిక్షించాలంటూ నిఖిల్

లాస్ వెగాస్‌లో జరిగిన కాల్పుల ఘటనలో 59 మందికి పైగా మృతిచెందారు. మరో 527 మందికి పైగా గాయపడ్డారు. మండాలే బే హోటల్‌లో జరిగిన కాల్పులు సంగీత ప్రేక్షకులకు హారర్ షోగా కాళరాత్రిగా మారింది. వీకెండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సాయుధుడి కాల్పులకు తీరన వ్యధను మిగిల్చింది. అమెరికా చరిత్రలోనే ఇది అత్యంత దారుణ మారణహోమ కాల్పుల ఘటనగా రికార్డు అయ్యింది. ఈ విషయమై హీరో నిఖిల్ తన ట్వీట్టర్‌లో స్పందించాడు.

‘ఓ మై గాడ్‌ లాస్‌ వేగాస్‌. ఆనందదాయకమైన నగరంలో ఇలా జరగడం భావ్యం కాదు. అమాయకులపై ఇలా కాల్పులకు తెగబడుతున్న నర రాక్షసులను అడ్డుకొని శిక్షించాలి. వందలాది తుపాకీ గుళ్లు పేలాయి. లాస్‌ వేగాస్‌లోని ప్రతి ఒక్కరి కోసం ప్రార్థిస్తున్నాను.

ఒక సంగీత విభావరి కోసమని ప్రజలు బయటికి వచ్చి, మృత్యు ఒడి చేరారు. ప్రపంచం మొత్తం ఇలాంటి భయాందోళనలతో నిండిపోతుంది. ఇలాంటివి రేపు మనకు, మన ప్రాంతంలో కూడా జరిగే అవకాశం ఉంది. ఇలాంటివి జరగడం నిజంగా విచారకరం అంటూ నిఖిల్ తన ఆవేదనను ట్వీట్టర్‌లో పోస్ట్ చేశాడు.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

లండన్ బాబులు

Now Showing

మహానుభావుడు SEP 29
స్పైడర్ SEP 27
జై లవ కుశ SEP 21
ARJUN REDDY AUG 25

Poll