టాలీవుడ్

‘హ్యాపీ వెడ్డింగ్‌’…నిహారిక, సుమంత్ అశ్విన్

niharika-sumanth-aaswin‘ఒక మనసు’ చిత్రం రిజల్ట్ ఎలా ఉన్నా..ఆ సినిమాతో హీరోయిన్ గా రంగప్రవేశం చేసి నటిగా గుర్తింపు తెచ్చుకున్న మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం తన రెండవ తెలుగు సినిమాకి సిద్ధమైంది. ‘సాహో’ వంటి భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉందనున్న ఈ చిత్రానికి ‘హ్యాపీ వెడ్డింగ్’ ఆనే టైటిల్ ను ఖరారు చేశారు.

ఈ చిత్రంకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించ‌నున్నాడు. అక్టోబ‌ర్ 4 నుండి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళ‌నున్న‌ట్టు తెలుస్తుండ‌గా, ఈ మూవీ ఆడియ‌న్స్‌కి మంచి వినోదాన్ని అందించేలా ఉంటుంద‌ని తెలుస్తుంది. నూత‌న ద‌ర్శ‌కుడు ల‌క్ష్మ‌ణ్ ఈ చిత్రానికి కార్య ద‌ర్శ‌క‌త్వ బాధ్యత‌లు చూసుకోనున్నారు.

ఇక జూన్‌లో నిహారిక రెండో సినిమా లాంచ్ కాగా, ప్ర‌స్తుతం ఈ సినిమా సెట్స్ పై ఉంది. త‌మిళంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్ర‌భుదేవ ద‌గ్గ‌ర అసిస్టెంట్ గా ప‌నిచేసిన ర‌విదుర్గ ప్ర‌సాద్ తెర‌కెక్కిస్తున్నాడు. ఈ య‌న‌కి ఇది తొలి సినిమా. ఎంఆర్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ మ‌రియు క‌విత కంబైన్స్ బేన‌ర్ పై మారిసెట్టి రాఘ‌వ‌య్య‌, బండారు బాబి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Comments

comments

Trailer

Promo

song

Coming Soon

స్పైడర్ SEP 27
మహానుభావుడు SEP 29
లండన్ బాబులు

Now Showing

జై లవ కుశ SEP 21
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18

Poll