టాలీవుడ్

ఎవరేమనుకున్నా…నవదీప్ ది మంచి నిర్ణయమే

Navdeep-Photosఇప్పటికే సుమంత్ అశ్విన్, వరుణ్ సందేశ్ లతో పాటు స్టార్ హీరో రానా కూడా వెబ్ సీరీస్ లలో నటిస్తున్నారు. తాజాగా మరో యంగ్ హీరో నవదీప్ కూడా ఈ లిస్ట్ లో చేరాడు. హీరోగా ఎంట్రీ , తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా ఆకట్టుకుంటున్నాడు. గతంలో ఓ టీవీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన నవదీప్, ఇటీవల బిగ్ బాస్ షోతో బుల్లితెర ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. ఇప్పుడు భారతదేశం బయట ఉన్న తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యేందుకు వెబ్ సీరీస్ లలో నటించనున్నట్టుగా తెలిపారు నవదీప్.

మన ముగ్గురి లవ్ స్టోరి పేరుతో తెరకెక్కుతున్న ఈ వెబ్ సీరీస్ లో తేజస్వీ కీలక పాత్రలో నటించనుంది. వైజయంతి మూవీస్ కు చెందిన వెబ్ డివిజన్ ఎర్లీ మాన్సూన్ టేల్స్ ఈ వెబ్ సీరీస్ ను నిర్మిస్తోంది. నందినీ రెడ్డి పర్యవేక్షణలో శశాంక్ ఏలేటీ ఈ వెబ్ సీరీస్ ను డైరెక్ట్ చేస్తున్నారు.

నవదీప్‌ ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తేజస్వి ప్రధాన పాత్రలో నటించిన ‘బాబు బాగా బిజీ’ చిత్రం ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

లండన్ బాబులు

Now Showing

మహానుభావుడు SEP 29
స్పైడర్ SEP 27
జై లవ కుశ SEP 21
ARJUN REDDY AUG 25

Poll