టాలీవుడ్ రివ్యూస్

రివ్యూ ‘ఎం.సి.ఎ’ : కమర్షియల్ కామెడీ

mca-posterనాని తాజాగా నటించిన చిత్రం ‘ఎం.సి.ఎ’ ఈ రోజు విడుదలయ్యింది. సాయి పల్లవి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. కుటుంబ కధా చిత్రంగా రూపొందిన ఈ చిత్రం పై మొదటి నుంచి మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందా లేదా అనే విషయాలు రివ్యూలో చూద్దాం.

చిత్రం కథేమిటంటే..

నాని, రాజీవ్ కనకాల ఇధ్దరు అన్నదమ్ములు హ్యాపీగా బ్యాచులర్ లైఫ్ ని లీడ్ చేస్తుంది. అయితే అది ఎప్పటిదాకా అంటే భూమిక …రాజీవ్ భార్యగా ఆ కుటుంబంలోకి వచ్చేదాకా. దాంతో నాని పరిస్దితి సైడ్ లైన్ అయిపోతుంది. వదిన చేతిలోకి ఫ్యామిలీ మొత్తం వెళ్లిపోతుంది. దాంతో నానికి మండుకొస్తుంది. అయితే వేరే దారి లేదు. ఈ లోగా వదినకు వరంగల్ ట్రాన్సఫర్ అవుతుంది. అన్న రాజీవ్ …తను డిల్లీ ట్రైనింగ్ కు వెళ్తున్నా కాబట్టి వదినతో పాటు వెళ్లమని పురమాయిస్తాడు. వేరే దారి లేక వదినతో వరంగల్ వెళ్తాడు. అయితే అక్కడ వదిన భూమికకు ఉద్యోగపరంగా ఇబ్బందులు వస్తాయి.. ఆర్టీవో గా పనిచేస్తున్న ఆమెను ట్రాన్సపోర్ట్ మాఫియా తమ బస్సుల పర్మిషన్ కోసం బెదిరిస్తుంది. ఈ నేపధ్యంలో నాని రంగంలోకి దిగుతాడు. నానికి ట్రాన్సపోర్ట్ మాఫియాకు మధ్య వార్ మొదలవుతుంది. ఆ తర్వాత అది ఏ టర్న్ తీసుకుంటుంది, ఈ సినిమాలో హీరోయిన్ సాయి పల్లవి పాత్ర ఏమిటి… వంటి విషయాలు తెరపై చూడాల్సిందే.

ఎలా ఉంది

సినిమా మొదట నుంచి ఎంటర్టైనింగ్ గా నడిచేలా ప్లాన్ చేసారు. మధ్యతరగతి కుటుంబాల్లో ఉండే కొద్దిగా బద్దకం ఉండి, ఉద్యోగం సద్యోగం లేని ఓ కుర్రాడు కథగా మొదలెట్టారు. దాని నుంచి మంచి సిట్యువేషనల్ కామెడీనే పిండారు. అయితే మెల్లిమెల్లిగా సినిమా ముందుకు వెళ్లే కొలిదీ…పూర్తి కమర్షియల్ రంగు పులుముకోవటం మొదలెట్టింది. హీరో, విలన్ గేమ్ లా సెకండాఫ్ తయారైంది. అయితే ఇంట్రవెల్ బ్లాక్ చాలా బాగుంది. అక్కడక్కడా మెరుపులు మెరిసినా రొటీన్ సీన్స్ ఎక్కువ అవటం ఇబ్బంది పెట్టింది. కుటుంబం కధా చిత్రం అనుకుని వచ్చిన వారికి సెకండాఫ్ కొద్దిగా నాన్సెన్స్ గా అనిపిస్తుంది.

కలిసొచ్చే అంశాలు: –

ఫ్యామిలీలకు పట్టే క్లీన్ కామెడీ, డైలాగులు (ముఖ్యంగా ఫస్టాఫ్ లో )

నాని, భూమిక క్యారక్టరైజేషన్స్ తీర్చిదిద్దిన తీరు, కొత్త బ్యాక్ డ్రాప్ అనిపిస్తుంది.
సాయిపల్లవి

మైనస్ లు

సినిమా సెకండాఫ్ ..రొటీన్ గా నడవటం
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ..సీన్స్ ని ఎలివేట్ చేసేలా లేకపోవటం
చుట్టేసిన ఫీలింగ్ కనపడటం చాలా చోట్ల

చివరి మాట..

నాని బ్రాండింగ్ మీద, అతని కామెడీ టైమింగ్ తో ..లాగేసే అవకాసముంది కానీ…దిల్ రాజు,నాని కాంబినేషన్ నుంచి ఎక్సపెక్ట్ చేసే స్దాయి సినిమా మాత్రం కాదు.

Comments

comments

Teaser

Latest

Song

Coming Soon

నా పేరు సూర్య MAY 4
కాలా

Now Showing

భరత్ అనే నేను APR 20
కృష్ణార్జున యుద్ధం APR 12
ఛల్ మోహన్ రంగ APR 5
రంగస్థలం MAR 30
నీదీ నాదీ ఒకే కథ MAR 23
MLA MAR 23
కిరాక్ పార్టీ MAR 16