బాక్స్ ఆఫీస్

నాని ‘కృష్ణార్జున యుద్ధం’ రిలీజ్ డేట్ వచ్చేసింది

Nani-Stills-Ninnu-Kori-Interview-3నాని హీరోగా దిల్‌రాజు ప్రొడక్షన్ బ్యానర్‌పై శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందించిన ‘ఎంసీఏ’రీసెంట్ గా విడుదలైంది. టాక్ తో సంభందం లేకుండా కలెక్షన్స్ వర్షం కురుస్తోంది. ఇదిలా ఉంటే నాని తదుపరి చిత్రం ‘కృష్ణార్జున యుద్ధం’ షూటింగ్‌‌లో కూడా పాల్గొంటున్నాడు. ‘కృష్ణార్జున యుద్ధం మొదలైంది’ అంటూ.. ఓ ఫొటోను సోషల్‌మీడియాలో ఆ మధ్యన పోస్ట్ చేశాడు నాని. ఆ ఫొటోలో బైక్‌పై ఆకట్టుకునే పిల్లనగ్రోవి ఉండడం విశేషం. ఇందులో కృష్ణుడు, అర్జునుడు కూడా నానియే.

నాని ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాను మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్నారు. వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకు హిప్ హాప్ తమిజా సంగీతం సమకూరుస్తున్నారు.

మరోసారి డ్యుయెల్ రోల్‌లో నటించనుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమాలో నాని సరసన అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. ఈ చిత్రాన్ని ఏప్రియల్ 9, 2018న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.

నాని, గాంధీ ఇద్దరూ సక్సెస్‌ఫుల్ ఫామ్‌లో ఉండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి దిగ్గజాలు నటించిన అలనాటి ‘కృష్ణార్జున యుద్ధా’న్ని నాని ఎలా తన స్టయిల్‌లో ఎలా ప్రేక్షకులను ఆకట్టుకునేలా చేస్తాడో వేచిచూడాలంటున్నారు అభిమానులు.

ఈ సినిమాతో పాటు శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్‌లో నాగార్జునతో పాటు నాని మల్టీ స్టారర్ మూవీలో కూడా నటించనున్నారు. ఈ సినిమా కూడా త్వరలో సెట్స్‌పైకి వస్తుందని టాక్.

Comments

comments

Teaser

Latest

Song

Coming Soon

నా పేరు సూర్య MAY 4
కాలా

Now Showing

భరత్ అనే నేను APR 20
కృష్ణార్జున యుద్ధం APR 12
ఛల్ మోహన్ రంగ APR 5
రంగస్థలం MAR 30
నీదీ నాదీ ఒకే కథ MAR 23
MLA MAR 23
కిరాక్ పార్టీ MAR 16