బాక్స్ ఆఫీస్

నానిపై నమ్మకంతో సీన్ లోకి దిల్ రాజు , ఎంత పెట్టాడో తెలుసా

naniనాచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘కృష్ణార్జున యుద్ధం’. నాని కెరీర్‌లో 21వ సినిమాగా వస్తున్న ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నాడు. చిత్రంలో నాని ద్విపాత్రాభినయంలో నటిస్తున్నాడు. వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకు హిప్‌హాప్ తమిజా సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. త్వరలో షూటింగ్ కంప్లీట్ చేసి ఏప్రిల్ 12న సినిమాను ప్రేక్షకుల ముందుంచాలని సన్నాహాలు చేస్తోంది చిత్ర యూనిట్. ఈ నేపధ్యంలో దిల్ రాజు ఈ చిత్రం రైట్స్ ని సొంతం చేసుకున్నారు.

వ‌రుణ్‌తేజ్ హీరోగా న‌టించిన `తొలి ప్రేమ‌` తెలుగు రాష్ట్రాల హ‌క్కులు 18 కోట్ల‌కు హోల్‌సేల్‌గా కొనుక్కున్నారాయ‌న‌. ఆ సినిమా భారీగానే లాభాలు తెచ్చింది. ప్ర‌స్తుతం నాని ద్విపాత్రాభిన‌యం చేసిన క్రేజీ మూవీ `కృష్ణార్జున యుద్ధం` తెలుగు రాష్ట్రాల రిలీజ్ హ‌క్కుల్ని దిల్‌రాజు గంప‌గుత్త‌గా ఛేజిక్కించుకున్నార‌ని తెలుస్తోంది. థియేట్రిక‌ల్ రైట్స్‌, శాటిలైట్‌- డిజిట‌ల్ రైట్స్ కోసం 21.75 కోట్లు చెల్లించ‌ార‌ట‌. `కృష్ణార్జున యుద్ధం` ఓవ‌ర్సీస్ హ‌క్కులు 4-5 కోట్ల మేర ప‌లికే అవ‌కాశం ఉంది.

‘కృష్ణార్జున యుద్ధం’ లో నాని ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ చిత్రంలో పారిస్ నేపథ్యంలో ఒక పాత్ర .. తిరుపతి నేపథ్యంలో మరో పాత్ర ఉంటాయట. నానికి గల క్రేజ్ ను, మార్కెట్ ను దృష్టిలో ఉంచుకుని దిల్ రాజు ఈ రైట్స్ ను దక్కించుకున్నట్టు చెబుతున్నారు. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ టేకప్ చేయడంతో ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరుగుతున్నాయి.

Comments

comments

Needi Naadi Oke Katha

Trailer

Latest

Song

Coming Soon

రంగస్థలం MAR 30
భరత్ అనే నేను APR 20
కాలా APR 27
నా పేరు సూర్య MAY 4

Now Showing

నీదీ నాదీ ఒకే కథ MAR 23
MLA MAR 23
కిరాక్ పార్టీ MAR 16
ఏ మంత్రం వేసావె MAR 9
మనసుకు నచ్చింది FEB 16
అ! FEB 16
తొలిప్రేమ FEB 10
చలో FEB 2