గాసిప్స్

మోక్షజ్ఞ ఎంట్రీ.. డైరక్టర్ ఫిక్స్, షూటింగ్‌ ఎప్పుడంటే?

mokshuతన కుమారుడు మోక్షజ్ఞని త్వరలో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం చేస్తున్నట్లు హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. బుధవారం మోక్షజ్ఞ పుట్టినరోజు జరుపుకొంటున్న సందర్భంగా ఈ విషయం పై బాలయ్య మాట్లాడారు. తన నియోజకవర్గమైన అనంతపురం జిల్లా హిందూపురంలో అభిమానుల మధ్య కేక్‌ కట్‌ చేశారు.

అభిమానులను సంపాదించుకోవడం గొప్ప వరమని, వారే తనకు శ్రీరామరక్ష అని ఈ సందర్భంగా బాలకృష్ణ అన్నారు. తనను ఆదరించినట్టే, తన కుమారుడ్ని కూడా ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది జూన్‌ మొదటి వారంలో మోక్షజ్ఞ తొలి సినిమా షూటింగ్‌ ప్రారంభమవుతుందని బాలకృష్ణ తెలిపారు.

ఈ నేపధ్యంలో ఈ చిత్రం దర్శకుడు ఎవరనే విషయం అంతటా హాట్ టాపిక్ గా మారింది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం తన వందో చిత్రం ..గౌతమి పుత్ర శాతకర్ణి డైరక్ట్ చేసిన క్రిష్ నే తన కుమారుడు లాంచింగ్ చిత్రానికి డైరక్టర్ గా ఫైనల్ చేసినట్లు సమాచారం.

తన 101వ చిత్రం ‘పైసా వసూల్‌’ విజయవంతంగా ప్రదర్శితమౌతున్న సందర్భంగా 101 మంది మహిళలకు చీరలను పంపిణీ చేశారు.
బాలకృష్ణ ప్రస్తుతం తన 102 చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. కె.ఎస్‌. రవికుమార్‌ దర్శకుడు. నయనతార, నటాషా దోషీ కథానాయికలు. సి. కల్యాణ్‌ నిర్మిస్తున్నారు. సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాలకృష్ణ దీని తర్వాత నందమూరి తారక రామారావు జీవితకథ ఆధారంగా తెరకెక్కించనున్న చిత్రంలో నటించనున్నట్లు సమాచారం.

Comments

comments

Latest

Recent

Songs

Coming Soon

జై లవ కుశ SEP 21
స్పైడర్ SEP 27
లండన్ బాబులు

Now Showing

యుద్ధం శరణం SEP 8
మేడమీదా అబ్బాయి SEP 8
పైసా వసూల్ SEP 1
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18
నేనే రాజు నేనే మంత్రి AUG 11
జయ జానకి నాయక AUG 11

Poll