టాలీవుడ్

సందీప్ కిషన్ అలాంటివాడు కాదు.

Sundeep-Kishan-Run-Movie-Run-Photos-1సందీప్ కిషన్‌, లావ‌ణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా న‌టించిన `ప్రాజెక్టు జెడ్‌` సినిమా వివాదం రోజు రోజుకీ పెద్దదవుతోంది. రీసెంట్ గా ఆ చిత్ర నిర్మాత బ‌షీద్‌.. హీరో సందీప్ కిష‌న్‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం తెలిసిందే. సందీప్ త‌న పాలిట విల‌న్‌గా మారాడ‌ని, సినిమాను చంపేయాల‌ని చూస్తున్నాడ‌ని బ‌షీద్ ఆరోపించాడు.

అలాగే ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌కు రాకుండా ఇబ్బంది పెడుతున్నాడ‌ని, సినిమా విడుద‌ల‌ను కూడా అడ్డుకుంటాన‌ని బెదిరించాడ‌ని తెలిపారు. త‌న‌లాగ మ‌రో నిర్మాత మోస‌పోకూడ‌ద‌నే ఈ విష‌యాలు చెబుతున్న‌ట్టు ఆయ‌న మీడియాకు వివ‌రించారు.అంతటితో ఆగకుండా `నక్ష‌త్రం` సినిమా తీసిన నిర్మాత‌ను కూడా సందీప్ చాలా ఇబ్బందులు పెట్టాడ‌ని, అందువ‌ల్ల ఆయ‌న హార్ట్ ఎటాక్‌కు గుర‌య్యాడ‌ని బ‌షీద్ ఆరోపించారు. ఈ ఆరోప‌ణ‌ల‌పై `న‌క్ష‌త్రం` నిర్మాత‌, `ప్రాజెక్ట్ జెడ్‌`లో సందీప్ పాత్ర‌కు డ‌బ్బింగ్ చెప్పిన రాకేందు మౌళి స్పందించారు.

న‌క్ష‌త్రం నిర్మాత మాట్లాడుతూ.. `సందీప్ కిష‌న్‌పై ఏవో ఆరోప‌ణ‌లు విన్నా. `న‌క్ష‌త్రం` సినిమా ఫ్లాప్ అయింది. ఆ సినిమా వ‌ల్ల మేం డ‌బ్బులు నష్ట‌పోయింది నిజ‌మే. కానీ, సినిమా షూటింగ్ స‌మ‌యంలో, త‌ర్వాత సందీప్ మాకు చాలా స‌హ‌క‌రించాడు. అత‌ను చాలా మంచి ఆర్టిస్ట్. మీకూ, మీకూ ఏవైనా గొడ‌వ‌లు ఉంటే మీరూ మీరూ చూసుకోండి. మ‌ధ్య‌లోకి మ‌మ్మ‌ల్ని లాగొద్దు. నాకు హార్ట్ ఎటాక్ వ‌చ్చింద‌న్న‌ది పూర్తిగా అబ‌ద్ధ‌మ‌`ని అన్నారు.

ఇక రాకేందు మౌళి మాట్లాడుతూ.. `సందీప్‌పై `ప్రాజెక్ట్ జెడ్‌` నిర్మాత చేసిన ఆరోప‌ణ‌ల‌న్నీ అబద్ధాలే. నిజానికి ఈ సినిమాను స్ట్రైట్ సినిమాగా చెబుతున్నారు. నిజానికి త‌మిళంలో తెర‌కెక్కిన `మాయ‌వ‌న్‌` సినిమాకు ఇది డ‌బ్బింగ్‌. సెన్సార్ కోసం ర‌ఫ్‌గా నేను డ‌బ్బింగ్ చెప్పాను. దాన్నే నా అనుమ‌తి లేకుండా థియేట‌ర్ల‌లోనూ ఉప‌యోగించుకున్నారు. ఇక‌, ఈ సినిమా కోసం సందీప్ ఆరు రోజుల పాటు డబ్బింగ్ చెప్పార`ని వెల్ల‌డించాడు.

Comments

comments

Trending

Latest

Song

Coming Soon

అజ్ఞాతవాసి JAN 10
జై సింహ JAN 12
చలో FAB 2
తొలిప్రేమ FAB 9

Now Showing

ఒక్క క్షణం DEC 28
MCA DEC 21
హలో DEC 22
మళ్ళీ రావా DEC 8
జవాన్ DEC 1

Poll